పోరాటయోధుడు బిర్సాముండా
● అదనపు కలెక్టర్ సంపత్‌రావు
ములుగు రూరల్/ఏటూరునాగారం: ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన యోధుడు బిర్సాముండా అని అదనపు కలెక్టర్ సంపత్‌రావు అన్నారు. మండల పరిధిలోని జగ్గన్నపేట ఆశ్రమ పాఠశాలలో శనివారం బిర్సాముండా 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బిర్సాముండా జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం జన జాతీ గౌరవ దినోత్సవంగా ప్రకటించిందన్నారు. ఆదివాసీల హక్కుల కోసం చేసిన పోరాటం మరువలేనిదని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం విజయలక్ష్మి, డిప్యూటి వార్డెన్ అనిత తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయంలో బిర్సాముండా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిర్సాముండా చిత్రపటానికి పీఓ చిత్రామిశ్రా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పీఓ మాట్లాడుతూ బిర్సాముండా గొప్ప వీరుడని, పోరాటపటిమ కలిగిన యోధుడని తెలిపారు. బిర్సాముండాను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, ఈఈ వీరభద్రం, డీటీడీఓ జనార్ధన్, సీడీపీఓ ప్రేమలత, ఎస్‌ఓ సురేష్‌బాబు, అదికారులు పాల్గొన్నారు.
వాలీబాల్ క్రీడాపోటీలు
మంగపేట: మండలంలోని లక్ష్మీనర్సాపురంలో వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడాపోటీలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక దక్షిణ మధ్యక్షేత్ర సంఘటన మంత్రి శివరామకృష్ణ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిర్సాముండా జయంతిని పురస్కరించుకుని ములుగు జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, కరకగూడెం మండలాల క్రీడాకారులకు వాలీబాల్ మండలస్థాయి పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
పోరాటయోధుడు బిర్సాముండా
పోరాటయోధుడు బిర్సాముండా


