రాజీమార్గమే రాజమార్గం
● జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్
ములుగు: రాజీమార్గమే రాజమార్గమని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రత్యేక లోక్ అదాలత్‌ను ఆయన శనివారం ప్రారంభించి మాట్లాడారు. ప్రత్యేక లోక్‌అదాలత్‌లో తమ కేసులను రాజీ చేసుకుంటే మరోసారి అప్పీల్ వ్యవస్థ ఉండదని తెలిపారు. ఇదే అంతిమ తీర్పు అని వెల్లడించారు. లోక్‌అదాలత్‌లో మూడు బెంచీలను ఏర్పాటు చేసి 151 పెండింగ్ కేసులను పరిష్కరించినట్లు వివరించారు. ఐదు నెలల క్రితం కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న దంపతులకు న్యాయవాది రంగోజు భిక్షపతి మధ్యవర్తిత్వం వహించి ఇద్దరి మధ్య రాజీ కుదర్చడంతో దంపతులిద్దరూ దండలు మార్చుకొని తిరిగి ఒక్కటైనట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ జూనియర్ సివిల్ జడ్జి శాంతి సోనీ, ఆర్డీఓ వెంకటేశ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల చారి, జనరల్ సెక్రటరీ రంగోజు భిక్షపతి, న్యాయవాదులు నర్సిరెడ్డి, వినయ్ కుమార్, కొండి రవీందర్, సునీల్ కుమార్, సుధాకర్, చిరంజీవి, రాజేందర్, రాజ్ కుమార్, కావ్య, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు మేకల మహేందర్, బానోత్ స్వామిదాస్, ఎస్సై వెంకటేశ్వర్‌రావు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


