రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి
● ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్యామ్‌సింగ్
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో రోడ్డు విస్తర్ణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆర్‌అండబీ ఎస్‌ఈ శ్యామ్‌సింగ్ కాంట్రాక్టర్‌ను అదేశించారు. శుక్రవారం ఆయన మేడారంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి నార్లాపూర్ చెక్‌పోస్టు వరకు మూడు కిలోమీటర్ల మేరకు రోడ్డు విస్తరణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. రోడ్డు విస్తీర్ణం వెట్‌మిక్స్ పనులు ఏ రోజు వరకు పూర్తవుతాయో పనుల వివరాల పురోగతి తేదీల వివరాలను చెప్పాలన్నారు. మంత్రుల ఆదేశాలకు అనుగుణంగా పనుల్లో పురోగతి మెరుగుపడాలని ఆదేశించారు. ఆయన వెంట డీఈఈ వెంకటరమణ, ఏఈ సాయితేజ ఉన్నారు.
విద్యుత్ పనుల పరిశీలన
మేడారంలో విద్యుత్ పనులను ఎస్‌ఈ మల్చూర్‌నాయక్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్డు విస్తీర్ణం పనుల్లో అడ్డుగా ఉన్న వైర్లను తొలగించి నూతనంగా విద్యుత్ లైన్ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. విస్తరిస్తున్న రోడ్డుకు కొంత దూరంలోనే విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో సమస్య తలెత్తకుండా ఉంటుందన్నారు. ఆయన వెంట డీఈఈ పులుసం నాగేశ్వర్‌రావు, అధికారులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. మేడారంలో రోడ్డు విస్తర్ణ పనులు జరుగుతున్న నేపథ్యంలో గ్రామస్తులు, వ్యాపారుల నుంచి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీంతో తహసీల్దార్ సురేష్‌బాబు పనులను పరిశీలిస్తూ ఎదురువుతున్న అడ్డంకులను పరిష్కరిస్తూ పనులను ముందుకు సాగేలా చర్యలు తీసుకుంటున్నారు.


