దేవునిగుట్టను టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతాం
● అటవీశాఖ కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్
ములుగు: జిల్లాలోని దేవునిగుట్టను టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతామని అటవీశాఖ కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్ అన్నారు. ములుగు మండలంలోని కొత్తూరు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న దేవునిగుట్టను శుక్రవారం ఆయన ములుగు డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్‌తో కలిసి సందర్శించారు. ఆలయంలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న దేవునిగుట్టను అన్ని విధాలా అభివృద్ధి చేసి పర్యాటకులు, భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సందర్భంగా దేవస్ధానం పాలకమండలి సభ్యులు సీసీఎఫ్ ప్రభాకర్‌ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ములుగు ఎఫ్‌ఆర్‌ఓ శంకర్, డీఆర్‌ఓ రవికుమార్, బీట్ ఆఫీసర్ భద్రునాయక్, పాలకమండలి సభ్యులు వీరంనేని కిషన్‌రావు, అక్కల సంపత్, రవీందర్‌రావు, మల్లయ్య, రాజ్‌కుమార్, రాంబాబు, సుమన్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.


