డీలర్లు కాంటా పెట్టి బియ్యం తీసుకోవాలి
● సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి
వెంకటాపురం(కె): జీసీసీ గోదాం నుంచి రేషన్ షాపులకు బియ్యం తరలించే సమయంలో డీలర్లు తప్పనిసరిగా బియ్యం కాంటా పెట్టుకుని షాపులకు తరలించాలని సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి అన్నారు. శుక్రవారం మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మండ కేంద్రంలోని జీసీసీ గోదాంను తనిఖీ చేశారు. గోదాంలో ఉన్న బియ్యం నిల్వలను పరిశీలించి మాట్లాడారు. రేషన్ షాపు డీలర్లు గోదాం నుంచి బియ్యం షాపునకు తరలించే సమయంలో బియ్యం కాంటా పెట్టుకోవాలని సూచించారు. కాంటా పెట్టకుండా తరలిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు చెప్పారు. కార్యక్రమలలో జీసీసీ మేనేజర్ స్వామి తదితరులు ఉన్నారు.


