మహిళలు సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి
ములుగు రూరల్: మహిళలు సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని ఉల్లాస్ జిల్లా కోఆర్డినేటర్ వేణుగోపాల్ అన్నారు. జిల్లాకేంద్రంలో నవ భారతి మండల సమైక్య ఆధ్వర్యంలో గ్రామ సంఘాల ప్రతినిధులు, వీఓలకు గురువారం ఉల్లాస్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉల్లాస్ శిక్షణలో చదువు రాని మహిళలకు చదువు నేర్పిస్తామని అన్నారు. మహిళలు సంపూర్ణ అక్షరాస్యత సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి అని తెలిపారు. గ్రామస్థాయిలో వలంటీర్ల ద్వారా సంఘం సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ డీపీఎం భవాణి, ఏపీఎం శ్రీనివాస్, సీసీలు విజయ, విజయలక్ష్మి, సిబ్బంది కిషన్‌రావు, సంఘం ప్రతినిధులు, వీఓలు పాల్గొన్నారు.
ములుగు రూరల్: ములుగు ఎకై ్సజ్ సేష్టన్ పరిధిలో వేర్వేరు కేసుల్లో జప్తు చేసిన వాహనాలకు ఈ నెల 14న ములుగు కార్యాలయంలో వేలం నిర్వహిస్తున్నట్లు ఎకై ్సజ్ సీఐ సుధీర్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి భూపాలపల్లి ధ్వర్యంలో వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలలో పాల్గొనేవారు 50 శాతం డిపాజిట్ సొమ్మును చెల్లించాలని సూచించారు. వేలంలో వాహనం పొందిన వారు అదే రోజు పూర్తి సొమ్ము చెల్లించి వాహనం తీసుకెళ్లాలని తెలిపారు. లేని పక్షంలో డిపాజిట్ సొమ్ము జప్తు చేయబడుతుందని తెలిఆపరు. వాహనాలను తుక్కు రూపంలో మాత్రమే తీసుకెళ్లాలని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు వేలంలో పాల్గొనాలని కోరారు.
ములుగు రూరల్: ప్రభుత్వం విద్యార్థుల పెండింగ్ సాల్కర్‌షిప్, ఫీజు రియింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మమన్‌యాదవ్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న రూ.8,500 కోట్ల స్కాలర్‌షిప్, ఫీజుల రియింబర్స్‌మెంట్‌ను విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 21 నెలలు గడుస్తున్నా.. ఫీజు రియింబర్స్‌మెంట్ విడుదల చేయడం లేదని అన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు కళాశాల ఫీజులు చెల్లించలేక విద్యకు దూరమయ్యే పరిస్థిత ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ స్కాలర్‌షాప్‌లను విడుదల చేయాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కోరిక సాయిరాం, ఉప్పల శ్రీతన్, రోహిత్, శిరీశ్, తదితరులు పాల్గొన్నారు.
మంగపేట: తెలంగాణ పురగిరి క్షత్రియ(పెరిక) కుల సంఘం రాష్ట్ర కార్యవర్గ అసోసియేట్ అధ్యక్షుడిగా ఆకా రాధాకృష్ణ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో బుధవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలో మండలంలోని తిమ్మంపేటకు చెందిన రాధాకృష్ణ అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గతంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన ఆయన మొదటి నుంచి పెరికలను ఐక్యం చేసి రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఆకాంక్షతో ముందుకెళ్తున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. ఈమేరకు రాధాకృష్ణ ఎన్నికపై ఆ సంఘం నాయకులు ఆక రవి, పెట్రం సుధాకర్, ధర్మపురి శ్రీనివాస్, ముత్తినేని ఆదినారాయణ, చిలకమర్రి రాజెందర్, పూజారి సురేందర్, చిలకమర్రి సతీష్, వేణు, ఆక సతీష్, పూజరి నరెందర్, వెంకన్న, దంతెనపల్లి నరెందర్, యరంగారి సురేష్, మోహన్‌రావు, ఆక రామకృష్ణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలోని నందీశ్వరుడికి కార్తీకమాసం సందర్భంగా ఈనెల 17న సోమవారం అభిషేక పూజలను నిర్వహించడానికి దేవాదా యశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ శనిగెల మహేష్ గురువారం తెలిపారు.
మహిళలు సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి


