రేకుల షెడ్డు.. మొండి గోడలు
పక్కా భవనం లేని పాఠశాల
పాఠశాలకు పక్కా భవనం నిర్మించాలి
ఏటూరునాగారం: పేద విద్యార్థులకు విద్యనందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటూరునాగారం మండలంలో మూడు ప్రభుత్వ పాఠశాలను ఈ ఏడాది జూన్ 7న ప్రారంభించింది. ఇందులో ఒకటి కొమురం భీం గొత్తికోయగూడెంలోని పాఠశాల. ఈ పాఠశాల నేటికీ గుడిసెలో కొనసాగుతోంది. నూతనంగా పాఠశాల మంజూరు కావడంతో గ్రామ పంచాయతీ నిధులతో నూతనంగా భవనం నిర్మించేందుకు గ్రామ పంచాయతీకి చెందిన ఓ కారోబార్ పనులు చేపట్టారు. అయితే రిజర్వ్ ఫారెస్టులో శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు లేవని అటవీశాఖ అధికారులు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో మొండిగోడలే దర్శనమిస్తున్నాయి. చేసేది ఏమిలేక ప్రభుత్వ పాఠశాలను ఆ గూడెం ప్రజలు స్వయంగా నిర్మించుకున్న గుడిసెలోనే నిర్వహిస్తున్నారు. వర్షం, గాలి దుమా రం వస్తే పాఠశాలను మూసివేయక తప్పడం లేదు. మట్టినేలపైనే కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పేద విద్యార్థులకు విద్య అందకుండా పోవడం ఒక సమస్య అయితే కనీసం శాశ్వత నిర్మాణం భవనం, మౌలిక వసతులు లేకపోవడం మరో సమస్యగా మారింది. తమ పిల్లలు అక్షరాలు నేర్చుకునేందుకు అవకాశం లేకుండా పోతుందని గిరిజన గూడెం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాణాన్ని అడ్డుకున్న అటవీశాఖ
ఇబ్బందిపడుతున్న విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలకు పక్కా భవనం నిర్మించాలి. గుడిసెలు, రేకుల ఇల్లు కావడంతో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. ఇక్కడ ఉన్న గిరిజనులకు సరైన విద్య, సౌకర్యాలు కల్పించాలి. వేరే దగ్గరకు వెళ్లి చదువుకునే పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి ఏ పాఠశాలకు పోవాలన్న నాలుగు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అందుకని పాలకులు, ప్రభుత్వ అధికారులు ఈ పాఠశాల భవన నిర్మాణం పూర్తయ్యేలా చూడాలి.
– కుర్సం భూమిక, కొమురంభీం నగర్
రేకుల షెడ్డు.. మొండి గోడలు
రేకుల షెడ్డు.. మొండి గోడలు
రేకుల షెడ్డు.. మొండి గోడలు


