రోడ్డు విస్తరణ పనుల్లో వేగం
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారంలో రోడ్డు విస్తరణ పనుల్లో ఆర్‌అండ్‌బీ అధికారులు వేగం పెంచారు. ఈనెల 12వ తేదీన మేడారం జాతర పనులపై నిర్వహించిన సమీక్షలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్.. రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యంపై అధికారులకు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గురువారం రోడ్డు విస్తర్ణ పనులు ఊపందుకున్నాయి.. అధికారులు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. రోడ్డు విస్తరణ పనులను మంత్రులు అదేశించిన సమయంలో పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా మేడారంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ చలమారెడ్డి జాతరలో భక్తుల సౌకర్యార్థం తాగునీటి పైపులైన్, తాత్కాలిక జీఐ షీట్ల మరుగుదొడ్ల పనులపై సంబంధిత కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. తాగునీటి పనుల ఏర్పాట్లు, మరుగుదొడ్ల పనులు త్వరగా ప్రారంభించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనుల ప్రదేశాల్లో వరి కోతలు కాలేదని పనులు చేయడం వీలు కాదని గుత్తేదారులు ఆయనకు వివరించగా.. వరి పొలాలు లేని ఖాళీ ప్రాంతాల్లో పనులు చేపట్టాలని ఆయన సూచించారు. ఆ శాఖ ఏఈలు, డీఈలతో ఎస్‌ఈ సమావేశం ఏర్పాటు చేసి జాతర పనులపై పలు సూచనలు, సలహాలు అందించారు. కాంట్రాక్టర్లతో దగ్గరుండి పనులు ప్రారంభించాలని అదేశించినట్లు తెలిసింది.
మంత్రుల ఆదేశాలతో అధికారుల్లో కదలిక
రోడ్డు విస్తరణ పనుల్లో వేగం


