చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలి
● దాసగాని సుమ
ఏటూరునాగారం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థినుల కోసం ప్రవేశపెట్టిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు దాసగాని సుమ అన్నారు. మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రవి తేజ అధ్యక్షతన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుమ మాట్లాడుతూ.. మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఆరోపించారు. మహిళల, విద్యార్థినులపైన అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయని వాపోయారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు సేఫ్టీ నాప్కిన్స్ అందించాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీమేరకు విద్యార్థినుకు స్కూటీలు అందించాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కేటాయించడంలేదని ఆరోపించారు. అనంతరం 10 మందితో కన్వినింగ్ కమిటీ ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్‌గా మధులత, కో–కన్వీనర్లుగా మానస, స్రవంతి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బాలు, నాయకులు మమత, రామలక్ష్మి, మనవిత, దామిని, జ్యోత్స్న, కావ్య, శబానా పాల్గొన్నారు.


