సమస్యలు పరిష్కరించాలని వినతి
ములుగు రూరల్: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మధ్యాహ్న భోజన కార్మికులు గురువారం మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ.. వంట కార్మికులను తొలగించి హరేరామా హరే కృష్ణ ఫౌండేషన్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. దీనివల్ల వేలాది మంది వంట కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లును తక్షణమే విడుదల చేయాని అన్నారు. ప్రతి విద్యార్థికి రూ.25 మెస్ చార్జీ చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అంజాద్ పాషా, రమ, రాజకుమారి, ప్రమీల, భారతి, కమల, రాధ, పద్మ, సమ్మక్క తదితరులు ఉన్నారు.


