
టెక్స్‌టైల్ క్లాత్ వేసింది.. వంద మీటర్లే..
గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోu
గోదావరి ఒడ్డుకు వేసిన టైక్స్‌టైల్ క్లాత్
ఏటూరునాగారం: వర్షాకాలం వచ్చిందంటే ఇరిగేషన్ అధికారులు నామమాత్రంగా గోదావరి కరకట్ట, ఒడ్డుకు మరమ్మతులు చేపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో గోదావరి ఉధృతికి విలువైన భూములను రైతులు కోల్పోతున్నారు. మళ్లీ వర్షాకాలం ముగిసే వరకు ఆ వైపు కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది. ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం నుంచి ఏటూరునాగారం వరకు ఉన్న గోదావరి కరకట్ట నిత్యం కోతకు గురవుతూ వస్తుంది. ఈ ఏడాది కోతకు గురికాకుండా ఉండేందుకు నూతన సాంకేతిక పద్ధతితో టెక్స్‌టైల్ క్లాత్‌ను వంద మీటర్ల వరకు అమర్చి కోతకు గురికాకుండా తగు జాగ్రత్తలను చేశారు. కానీ మరోచోటు నుంచి ఒడ్డు కోతకు గురవుతూ వస్తుంది. దీంతో ఏం చేయాలో అర్ధంకాక ఇసుక బస్తాలను ఇరిగేషన్ అధికారులు సిద్ధం చేస్తున్నారు.
గేట్ల మూసివేతలో నిమ్మకు నీరెత్తినట్లుగా..
ఈ ఏడాది వర్షాలు భారీగా లేకపోవడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చడం లేదు. దీంతో మరమ్మతులు చేసుకునే వెసులుబాటును కల్పించినప్పటికీ ఇరిగేషన్‌శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. కరకట్టకు ఉన్న గేట్లను మూసివేడయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జంపన్నవాగు వద్ద మూడో గేటు తెరిచి ఉడడం గమనార్హం. ఇరిగేషన్ శాఖ అధికారులకు వరద అంతా గ్రామంలోకి వచ్చే వరకు పట్టించుకోరనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా గేట్లను మరమ్మతులు చేయించి వెంటనే మూసివేసి నీరు గ్రామంలోకి రాకుండా చేయాలని రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్‌రీల్
కోతకు గురవుతున్న గోదావరి ఒడ్డు
అరకొరగా గేట్లు మూసివేత
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇరిగేషన్‌శాఖ

టెక్స్‌టైల్ క్లాత్ వేసింది.. వంద మీటర్లే..