
మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
ములుగు రూరల్: ములుగు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్‌లో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా మార్కెటింగ్ అధికారి కనకశేఖర్ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యవర్గాన్ని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మార్కెట్ కమిటీ కార్యవర్గ నియామకం పూర్తిగా నిబంధనలకు లోబడి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా చేపట్టామన్నారు. గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీ 7 సంవత్సరాలుగా కమిటీ లేకుండా నిర్వాహణ సాగిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి సోనియా, రాష్ట్ర టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు, మహిళా కోఆపరేటీవ్ కార్పొరేషన్ చైర్మన్ శోభ, జిల్లా పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, భూపాలపల్లి జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీదేవి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, చాంద్‌పాషా, మాడుగుల రమేష్, చిక్కుల రాములు, దేవ్‌సింగ్, పాలకుర్తి సమ్మయ్య, రేవంత్‌యాదవ్ పాల్గొన్నారు.