మళ్లీ మనదే అధికారం | Sakshi
Sakshi News home page

మళ్లీ మనదే అధికారం

Published Sat, Nov 25 2023 1:18 AM

- - Sakshi

శనివారం శ్రీ 25 శ్రీ నవంబర్‌ శ్రీ 2023

భూపాలపల్లిలో ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన ప్రజలు

మీడియా ప్రతినిధులకు

ఆటంకం

ములుగు: సీఏం కేసీఆర్‌ ఆశీర్వాద సభ కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులకు పోలీసులు శుక్రవారం ఆటంకంగా నిలిచారు. పోలీసు శాఖ, బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పాసులు జారీ చేసినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ప్రధాన గేటు వద్దనే నిలిపేశారు. మీడియా, పోలీసులకు కొద్ది సేపు వాగ్వాదం జరిగింది. స్టేజీపై ఉన్న రాష్ట్ర ప్రధాన నాయకులు గమనించి మీడియా పాసులను చూసి అనుమతించాలని కోరడంతో అనుమతిచ్చారు. ఈ క్రమంలో మీడియా సభ్యులకు పార్టీ నాయకులకు తోపులాట జరిగాయి.

నేడు కోదండరాం రాక

ములుగు: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీజేఎస్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా యువత మేలుకో రాష్ట్రాన్ని ఏలుకో అనే నినాదంతో నేడు (శనివారం) డీఎల్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న నిరుద్యోగ సమ్మేళన సభకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం హాజరుకానున్నారు. నిరుద్యోగులు, యువత భారీగా తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ పా ర్టీ జిల్లా అధికార ప్రతినిధి కత్తెరపల్లి భాస్కర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.

సమస్యలు పరిష్కరించాలి

వెంకటాపురం(కె): మండల పరిధిలోని ఆలుబాక పంచాయతీ తానిపర్తి గ్రామంలోని పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా అధ్యక్షుడు రవి అన్నారు. శుక్రవారం తానిపర్తి పాఠశాలను ఎస్‌ఎఫ్‌ఐ బృందం సందర్శించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ పాఠశాలకు ఒక్కడే ఉపాధ్యాయుడు ఉండటంతో విద్యార్థులకు సరైన విద్యా భోదన అందటం లేదన్నారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవన్నారు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీర్రాజు, వంశీ తదితరులు ఉన్నారు.

అకాల వర్షం.. అపార నష్టం

గోవిందరావుపేట: ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి వస్తున్న సమయంలో శుక్రవారం అకాలవర్షం రైతులను నిండాముంచింది. మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి కోసిన వరి నీట మునుగగా, కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలవాలింది. ధాన్యం రాశులు వర్షానికి తడవకుండా ఉండేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు రైతులు లబోదిబో అంటున్నారు. లక్నవరం ఆయకట్టులో ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. పలు చోట్ల కోసిన వరిపంట పొలాల్లోనే ఉండిపోయింది. మండలంలోని మచ్చాపూర్‌, బుస్సాపూర్‌, చల్వాయి, గోవిందరావుపేట, దుంపెల్లిగూడెం, పస్రా గ్రామాల్లో ధాన్యం రాశుల చుట్టూ నీళ్లు చేరి తడిచి ముద్దయ్యాయి. వర్షం ఇలాగే ఉంటే ధాన్యం రంగుమారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరిపంట నేలకు పడిపోవడంతో ధాన్యం మొలకెత్తే అవకాశం ఉందని, దీంతో దిగుబడులు తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుణాత్మక విద్య

అందించాలి

ఏటూరునాగారం: గిరిజన విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని ఐటీడీఏ ట్రైబల్‌ వెల్ఫేర్‌ గ్రేడింగ్‌ ప్యానెల్‌ హెడ్‌ సావిత్రి అన్నారు. శుక్రవారం మండలంలోని చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాలలో ప్యానెల్‌ టీం సభ్యులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే భోజనం, రికార్డులు పరిశీలించి బోదన విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు మరింత శుభ్ర పర్చాలన్నారు. విద్యావిభాగంలో పాఠశాల గ్రేడింగ్‌ను ట్రైబల్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌కు నివేదిక పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాసం సారంగపాణి, టీచర్లు పాల్గొన్నారు.

సాక్షిప్రతినిధి, వరంగల్‌/ భూపాలపల్లి/ములుగు : తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్‌దే అధికారమని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. 50 ఏళ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలను అరిగోస పెట్టిందని, ఎన్నికల సమయంలో అబద్దాలు, హామీలతో వస్తున్న ఆ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బడే నాగజ్యోతి, గండ్ర వెంకట రమణారెడ్డిలను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ హయాంలో గిరిజన ప్రాంతాలు ఎన్‌కౌంటర్లకు నిలయంగా మారాయని, ఎమర్జెన్సీలు జైలు పాలు చేసే బానిస బతుకుల విముక్తి కోసం బడే నాగజ్యోతి తల్లిదండ్రులు అటవీ బాట పట్టి అసువులు బాశారన్నారు. తెలంగాణ ఏర్పాటు, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు మార్గదర్శకాలతో సమస్యలను నిర్మూలించగలిగామన్నారు.

నాగజ్యోతి గెలిస్తే ములుగు ఓ జ్యోతిలా వెలుగుతుంది

‘ములుగులో కొన్ని పనులు కావాల్సి ఉంది. ఎమ్మెల్యేగా నువ్వు ఏ పార్టీలోనైనా ఉండొచ్చు గాక. తప్పకుండా ముఖ్యమంత్రిని కలవాలి. గవర్నమెంట్‌లో ఉన్నవాళ్లను కలవాలి, మాట్లాడాలి. మీ ములుగు ఎమ్మెల్యే ఎన్నడూ రాదు. ఏం అడగదు. మాకు తోచినవి.. తెలిసినవి.. మా పార్టీవాళ్లు చెప్పిన పనులు చేసుడే తప్ప ఆమె వచ్చి ఎన్నడూ అడుగదు. ఏం చేసిర్రు మీరు అంటే.. ఏం చేయలేదు ? మీ కాంగ్రెస్‌ పాలనలో మంచినీరు ఇచ్చారా? కాంగ్రెస్‌ పాలనలో కరెంటు ఇచ్చారా? రైతుబంధు ఇచ్చారా? మరి ఇవాళ ఇవన్నీ మేం ఇచ్చాం కదా? మీ కాంగ్రెస్‌ కాలంలో పోడు భూములు పంచారా? ఇవాళ మేం పంచినం కదా? మరి ఏం చేశారంటే..? నేను చెప్పేది ఏందంటే ఈ వాదులాటలు కాదు. జరగాల్సింది ప్రజల క్షేమం.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బడే నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా వెలుగుతుంది అని కేసీఆర్‌ అన్నారు.

సింగరేణిని ఆగం చేసింది కాంగ్రెస్సే..

‘సింగరేణి సంస్థను ఆగం చేసింది కాంగ్రెస్‌ పార్టీనే. సంస్థ అప్పులు కట్టలేక 49 శాతం వాటాను కేంద్రానికి అప్పగించింది. డిపెండెంట్‌ ఉద్యోగాలు కూడా వద్దని సంతకం చేసింది కాంగ్రెస్‌ పార్టీయే’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. వర్షం కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ, ప్రజలు ఇంత భారీ ఎత్తున తరలి రావడం బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి సంకేతమని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పైరవీలు, దళారీ వ్యవస్థ విపరీతంగా పెరుగుతుందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక సింగరేణిలో 15 వేల మందికి డిపెండెంట్‌ ఉద్యోగ అవకాశాలు కల్పించామని గుర్తుచేశారు. 38 శాతం లాభాల వాటా ఇచ్చామన్నారు. ఆయా సభల్లో మంత్రి సత్యవతి రాథోడ్‌, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, బస్వరాజు సారయ్య, బీఆర్‌ఎస్‌ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు సతీష్‌రెడ్డి, మెట్టు శ్రీనివాస్‌, వీరమల్ల ప్రకాశ్‌, వాసుదేవరెడ్డి, పోరిక గోవింద్‌ నాయక్‌, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, టీబీజీకేఎస్‌ నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా..

బీఆర్‌ఎస్‌ భూపాలపల్లి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి

సీఎం కేసీఆర్‌ సహకారంతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌ పునాదులు వేశాడన్నారు. చిన్న గ్రామ పంచాయతీగా ఉన్న భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన మహనీయుడు కేసీఆర్‌ అని కొనియాడారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఇక్కడ మెడికల్‌ కళాశాల ఏర్పాటు అయిందని, పేదలకు ఇళ్లు లభించాయన్నారు. ఈసారి బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక భూపాలపల్లిలో ఐటీ టవర్‌, ఇంజనీరింగ్‌ కళాశాల, చిట్యాలలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా ప్రజలు నమ్మవద్దని కోరారు.

రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఏం చేసింది? :

బీఆర్‌ఎస్‌ ములుగు అభ్యర్థి బడే నాగజ్యోతి

‘నాకు అయ్యవ్వలు లేరు, నాకంటూ కుటుంబం లేదు. నియోజకవర్గ ప్రజలే నా కుటుంబం, నన్ను సాదుకుంటారో.. చంపుకుంటారో మీ ఇష్టం’ అని ములుగు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క నియోజక వర్గానికి చేసిందేమీ లేదన్నారు. ములుగుకు మెడికల్‌ కాలేజీ , మల్లంపల్లి మండలం, మున్సిపాలిటీ ప్రకటించిన ప్రభుత్వానికి ఈసారి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ‘మన తండాలో మన పాలన – మన గూడెంలో మన రాజ్యం’ అనే నినాదంతో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసిన కేసీఆర్‌ను మరోసారి సీఎంను చేసుకుందామన్నారు. ఆదివాసీ ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో కట్టించి మన ఆత్మ గౌరవాన్ని నిలిపారన్నారు.

న్యూస్‌రీల్‌

ములుగు, భూపాలపల్లిలో బీఆర్‌ఎస్‌ గెలవాలి

ప్రజలను ఆగం చేసిన పార్టీలు మనకొద్దు..

కర్ణాటక ప్రజలు బాధపడ్తున్నరు

సింగరేణిని ఆగం చేసింది కాంగ్రెస్సే

ఆ పార్టీ అధికారంలోకి వస్తే పైరవీలు,

దళారీ వ్యవస్థ

కరెంట్‌ మూడు గంటలు కావాలా.. 24 గంటలా..

ధరణిని బంగాళాఖాతంలో కలిపితే

రైతుబంధు ఎలా వస్తది

ములుగు, భూపాలపల్లి ప్రజా ఆశీర్వాద

సభల్లో సీఎం కేసీఆర్‌

కేసీఆర్‌ పర్యటన ఇలా..

సాయంత్రం 3.42 గంటలకు : ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు స్టేడియంలో సీఎం హెలికాప్టర్‌ ల్యాండింగ్‌

3.50 గంటలకు : స్టేడియంలోని సభ ప్రాంగణానికి రాక

4.02 గంటలకు : సీఎం కేసీఆర్‌ ప్రసంగం ప్రారంభం

4.26 గంటలకు ప్రసంగం ముగింపు

4.32 గంటలకు : హెలికాప్టర్‌లో

జయశంకర్‌ భూపాలపల్లికి పయనం

4.45గంటలకు : భూపాలపల్లిలో హెలికాప్టర్‌ ల్యాండింగ్‌

4.55గంటలకు: సభ ప్రాంగాణానికి రాక

5.05 గంటలకు: ప్రసంగం ప్రారంభం

5.12 గంటలకు : ప్రసంగం ముగింపు

5.15 గంటలకు : హెలికాప్టర్‌లో

హైదరాబాద్‌కు పయనం

ములుగు, భూపాలపల్లి అభివృద్ధి నా బాధ్యత...

ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యతను తానే తీసుకుంటానన్న సీఎం కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బడే నాగజ్యోతి, గండ్ర వెంకటరమణా రెడ్డిలను గెలిపించాలని కోరారు. బడే నాగజ్యోతి తండ్రి ఉద్యమాల్లో పోయి అమరుడైండని, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిండన్నారు. ‘తల్లిలేదు తండ్రి లేడు.. ములుగు ప్రజలు నా తల్లిదండ్రులని నాగజ్యోతి చెప్పింది. నేను మీ అందరినీ కోరుతున్నా. ఆమె కష్టపడి చదువుకున్నది. ఉన్నత విద్యావంతురాలుగా ఎదిగింది. సర్పంచ్‌గా పని చేసి ఇవాళ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ హోదాకు వచ్చింది.. నాగజ్యోతిని గెలిపించాలి’ అని సీఎం కేసీఆకోరారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి నియోజకవర్గం కోసం బాగా కష్టపడుతున్నారన్నారు. తన దగ్గరకు వచ్చిన ప్రతీసారి అభివృద్ధి పనులకు నిధులు అడిగాడే తప్ప సొంత పనులు ఎప్పుడే అడగలేదని, కనుక అనుభవజ్ఞుడైన రమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్‌ కోరారు.

ములుగు ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన ప్రజలు
1/9

ములుగు ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన ప్రజలు

2/9

3/9

నృత్యం చేస్తున్న సత్యవతిరాథోడ్‌, కవిత, బడే నాగజ్యోతి
4/9

నృత్యం చేస్తున్న సత్యవతిరాథోడ్‌, కవిత, బడే నాగజ్యోతి

మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌, పక్కన అభ్యర్థి బడే నాగజ్యోతి
5/9

మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌, పక్కన అభ్యర్థి బడే నాగజ్యోతి

6/9

7/9

8/9

9/9

Advertisement
 
Advertisement
 
Advertisement