వైల్డ్‌ డాగ్‌ ఆన్‌ మిషన్‌ 

Wild Dog Movie Shooting Started - Sakshi

ఎన్‌ఐఏ ఆఫీసర్‌ విజయ్‌ వర్మగా నాగార్జున నటిస్తున్న చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. అషిషోర్‌ సల్మాన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సయామీ ఖేర్‌ కథానాయిక. అన్వేష్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి నిర్మాతలు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సోమవారం నుంచి చిత్రీకరణ ప్రారంభం అయింది. దాదాపు సగం చిత్రీకరణ కోవిడ్‌ ముందే పూర్తయిందని సమాచారం. సీనియర్‌ స్టార్‌ హీరోల్లో ఇలా సెట్‌లోకి అడుగుపెట్టిన ఫస్ట్‌ హీరో నాగార్జునే. ఒకవైపు ఈ సినిమా మరోవైపు ‘బిగ్‌ బాస్‌ 4’తో నాగ్‌ బిజీగా ఉంటారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top