మహేశ్‌ బాబు-రాజమౌళి సినిమాలో విలన్‌గా స్టార్‌ హీరో!

Vikram Chiyaan To Play Villain Role In Rajamouli And Mahesh Babu Movie - Sakshi

ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ చిత్రంతో బిజీగా ఉన్నారు మహేశ్‌బాబు. ఆ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలోని సినిమాలో హీరోగా నటిస్తారు. ఈ రెండు చిత్రాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక గురించి ఫిల్మ్‌నగర్‌లో ఓ టాక్‌ వినిపిస్తోంది. ఇందులో విలన్‌ క్యారెక్టర్‌కు హీరో విక్రమ్‌ పేరును పరిశీలిస్తోందట చిత్రబృందం. మరి... ఈ వార్త నిజమేనా? అనే విషయం తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top