
అలాంటి పాత్రలు ఆఫర్ చేస్తే నిర్దాక్షిణ్యంగా నో చెప్పాను. అలా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. దానివల్ల మంచే జరిగింది. ఇప్పుడు నాకు భిన్న రకాల పాత్రలు వస్తున్నాయి. విభిన్నమైన పాత్రల్లో నన్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. నచ్చిన రోల్స్ చేస్తూ జనాలను నవ్వించగలుగుతున్నాను. చిన్నదానికి కూడా విమర్శించడమే పనిగా పె
ఒక్కసారి ఏదైనా పాత్రతో గుర్తింపు వచ్చిందంటే పదేపదే అలాంటి రోల్సే ఆఫర్ చేస్తుంటారు. బాలీవుడ్ నటి సునీత రాజ్‌వార్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గోడు వెల్లబోసుకుంది. చదువైపోయిన వెంటనే నాకు సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే ఎప్పుడూ ఒకేరకమైన రోల్స్ ఆఫర్ చేసేవారు. ఎక్కువగా పనిమనిషి పాత్రలే వచ్చేవి. అవి చేసీచేసీ బోర్ కొట్టింది. సరైన రోల్స్ రాకపోవడంతో యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నాను.

పనిమనిషిగా బోర్..
పనిమనిషిగా నటించొద్దని ఫిక్సయ్యాను. అలాంటి పాత్రలు ఆఫర్ చేస్తే నిర్దాక్షిణ్యంగా నో చెప్పాను. అలా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. దానివల్ల మంచే జరిగింది. ఇప్పుడు నాకు భిన్న రకాల పాత్రలు వస్తున్నాయి. విభిన్నమైన పాత్రల్లో నన్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. నచ్చిన రోల్స్ చేస్తూ జనాలను నవ్వించగలుగుతున్నాను. చిన్నదానికి కూడా విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఈ రోజుల్లో జనాల ప్రేమను పొందడం చాలా కష్టం.
ఇంతకంటే ఏం కావాలి?
కానీ నాపై ఇంత ప్రేమాభిమానాలు కురిపిస్తుంటే సంతోషంగా ఉంది. ఇండస్ట్రీలో కూడా నన్ను చూసే పద్ధతి మారింది. ఇప్పుడు నా కెరీర్‌తో నేను సంతోషంగా ఉన్నాను. ఏదో సాధించేసినంత హ్యాపీగా ఉంది. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? అని సునీత రాజ్‌వార్ చెప్పుకొచ్చింది. కాగా సునీత.. హిస్, బుద్ధ మర్ గయా, స్త్రీ, బాలా, శుభ్ మంగళ్ జ్యాద సావధాన్ వంటి పలు చిత్రాల్లో నటించింది. పంచాయత్ 2, పంచాయత్ 3, గుల్లక్ అనే వెబ్ సిరీస్‌లతో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది.
చదవండి: కుటుంబ సభ్యులు వద్దని చెప్పినా ఆ పాటలో నటించాను: సమంత