RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా థియేటర్‌లో వ్యక్తి గన్‌తో హల్‌చల్‌

RRR Movie: Man With Gun Hulchul in RRR Theatre at East Godavari - Sakshi

సాక్షి, పిఠాపురం (తూర్పు గోదావరి): కొమురం భీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటించిన పాన్‌ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం రణం రుధిరం). బాహుబలి తర్వాత రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరెక్కించాడు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించాడు. భారీ అంచనాల మధ్య నేడు (మార్చి 25) థియేటర్లలో రిలీజైందీ మూవీ. ఈ సందర్భంగా థియేటర్లలో ఫ్యాన్స్‌ సందడి చేస్తుండగా ఓ వ్యక్తి మాత్రం గన్‌తో హల్చల్‌ చేశాడు.

తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్‌లోకి ఒక వ్యక్తి గన్‌తో వచ్చాడు. తుపాకీ చేత్తో పట్టుకుని అటూఇటూ తిరగడంతో ప్రేక్షకులు కొంత భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అతడి చేతిలో ఉన్నది బొమ్మ తుపాకీగా అనుమానిస్తున్నారు.

చదవండి: థియేటర్స్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ సందడి

RRR Review: ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఎలా ఉందంటే..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top