RRR Movie: మేకింగ్‌ వీడియోకి డేట్‌ ఫిక్స్‌

RRR Movie Making Video To Release On July 15 - Sakshi

దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ల భారీ మల్టీస్టారర్‌ చిత్ర ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న  ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ దాదాపు పూర్తయ్యింది. 

ఇక ఈ సినిమా నుండి ఏమైన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ వ‌స్తాయాని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరిట ఈ సినిమా మేకింగ్ వీడియోను ఈ నెల 15న ఉదయం 11గంటలకు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఆ సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుద‌ల చేసింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top