Rashmika Mandanna: ఫిట్‌గా ఉండాలంటే అది ముఖ్యం

Rashmika Mandanna Talks About Her Fitness - Sakshi

‘‘మన శరీరం ఫిట్‌గా ఉండాలంటే మనసు స్థిరంగా ఉండాలి. ఫిట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాక మనం పాటించాల్సింది ‘స్థిరత్వం’’ అంటున్నారు రష్మికా మందన్నా. ఇంకా రష్మిక మాట్లాడుతూ – ‘‘ఏ లక్ష్యాన్నయినా సాధించడానికి స్థిరత్వం ముఖ్యం. ఫిట్‌నెస్‌కి కూడా ఇది వర్తిస్తుంది. మీరు చేసే వ్యాయామాలు, ఫిజియోలు, డైట్, ఆలోచనలన్నీ స్థిరంగా ఉండాలి.

ఫిట్‌నెస్‌ కోసం చేసేవి మొదట్లో కష్టంగా అనిపిస్తాయి. కానీ అలవాటయ్యాక చాలా సరదాగా ఉంటుంది. ఫిట్‌నెస్‌ గోల్స్‌ని రీచ్‌ అయ్యేకొద్దీ మనలో ఉత్సాహం పెరుగుతుంది’’ అన్నారు. తెలుగులో అగ్రహీరోయిన్‌గా దూసుకెళుతున్న ఈ కన్నడ బ్యూటీ హిందీ సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా వర్కవుట్స్‌ని మాత్రం మిస్‌ కానంటున్నారు రష్మికా మందన్నా.

చదవండి: అతడి వల్లే బతికున్నాను, వాళ్లందరికీ థ్యాంక్స్‌.. మెగా హీరో

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top