మరోసారి డీప్ ఫేక్‌ బారిన రష్మిక.. వీడియో వైరల్‌..! | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: మరోసారి డీప్ ఫేక్‌ బారిన రష్మిక.. వీడియో వైరల్‌..!

Published Tue, May 28 2024 3:44 PM

Rashmika Mandanna Deepfake Video In Bikini Near Waterfall Goes Viral

డీప్ ఫేక్‌ టెక్నాలజీతో సెలబ్రిటీలకు పెద్ద తలనొప్పిగా మారింది. కొందరు దుండగులు ఆధునిక టెక్నాలజీతో దుర్వినియోదగానికి పాల్పడుతున్నారు. మొదట రష్మిక మందన్నా డీప్‌ ఫేక్ రావడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలువురు ప్రముఖ తారలు సైతం ఈ డీప్ ఫేక్‌ బారిన పడ్డారు. దీంతో భారత ప్రభుత్వం సైతం ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

ఇదిలా ఉండగా మరోసారి రష్మిక డీప్‌ ఫేక్ బారిన పడింది. ఆమె ఫేస్‌ను మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ కొలంబియా మోడల్ డానియెలా విల్లారియల్ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను ఎడిట్ చేసిన ఈ వీడియోను రూపొందించారు. అందులో రష్మిక ఫేస్‌ వచ్చేలా మార్చిన వీడియో కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న డీప్‌ఫేక్ వీడియోపై రష్మిక ఇంకా స్పందించలేదు. 

కాగా.. గతేడాది నవంబర్‌లోనూ రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరలైన సందడి తెలిసిందే. ఆ వీడియోను రూపొందించిన ప్రధాన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అలియా భట్, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, నోరా ఫతేహి, అమీర్ ఖాన్, కాజోల్ వంటి  ప్రముఖులు డీప్ ఫేక్ బాధితులుగా నిలిచారు. సినిమాల విషయానికొస్తే పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్‌లో  సికందర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన రష్మిక నటించనుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement