అయ్యో.. రష్మిక.. చూసుకోవాలిగా! | Rashmika Mandanna Accidentally Sits In Wrong Car At Mumbai Airport, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Rashmika Mumbai Airport Video: అయ్యో.. రష్మిక.. వేరేవాళ్ల కారులో..

Published Mon, Jan 8 2024 4:48 PM

Rashmika Mandanna Accidentally Sits in Wrong Car at Mumbai Airport, Watch Video - Sakshi

ఒక్క హిట్‌ వస్తే చాలు గ్యాప్‌ లేకుండా సినిమాలు చేస్తున్నారు హీరోయిన్లు. గ్యాప్‌ ఇస్తే పత్తా లేకుండా పోతామనుకుంటున్నారో, లేదంటే రేసులో వెనకబడిపోతామని భావిస్తున్నారో కానీ వీలైనన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాలంతో పోటీపడుతూ సినిమాలు చేస్తున్నారు. నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఈ మధ్యే యానిమల్‌ చిత్రంతో సూపర్‌ డూపర్‌ హిట్‌ అందుకున్న ఈ బ్యూటీ ఈ ఏడాది పుష్ప 2 సినిమాతో సందడి చేయనుంది.

హడావులో రష్మిక
తను ఒప్పుకన్న ప్రాజెక్టుల కారణంగా తరచూ ముంబై, హైదరాబాద్‌ తిరుగుతూ ఉంటుందీ బ్యూటీ. పైగా యానిమల్‌ సక్సెస్‌ పార్టీ కోసం శనివారం ముంబై వెళ్లింది రష్మిక.  పార్టీకి లేటవుతుందన్న హంగామాలో ఉందీ బ్యూటీ. అది పట్టించుకోని అభిమానులు సెల్ఫీ ప్లీజ్‌ అంటూ వెంటపడ్డారు. వారిని తప్పించుకునే క్రమంలో తనకు తెలియకుండానే తన కారుకు బదులు మరో కారులో ఎక్కేసి కూర్చోబోయింది.

అది మనది కాదనడంతో
ఇంతలో తన టీమ్‌ ఆ కారు మనది కాదు అని అరవడంతో నాలుక్కరుచుకుని వెనక్కు వచ్చేసింది. మళ్లీ పరిగెత్తుకుంటూ తన కారు దగ్గరకు వెళ్లిపోయింది. ఒకటీరెండు సెల్ఫీలు ఇచ్చేసిన ఆమె నాకు టైమ్‌ లేదని చెప్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: విజయ్- రష్మిక ఎంగేజ్‌మెంట్‌.. అప్పుడేనా?

చదువుకునే రోజుల్లో పాత దుస్తులు వేసుకుని పనికి..

 
Advertisement
 
Advertisement