Ranbir Kapoor-Alia Bhatt: రణ్‌బీర్‌- ఆలియా పెళ్లయిపోయిందా? నిజమేంటంటే?

Ranbir Kapoor, Alia Bhatt Wedding Pics Goes Viral, Here Is a Fact Check - Sakshi

ఎక్కడకు వెళ్లినా సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా మారుతున్నారు బాలీవుడ్‌ ప్రేమ పక్షులు రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌. కరోనా వల్ల పెళ్లి వాయిదా వేసుకుంటూ వచ్చిన ఈ లవ్‌ బర్డ్స్‌ త్వరలోనే వివాహానికి సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు పెళ్లి షాపింగ్‌ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సడన్‌గా రణ్‌బీర్‌, ఆలియా పెళ్లి చేసుకున్నారంటూ ఓ వార్త నెట్టింట గుప్పుమంది. ఏప్రిల్‌ 1న వీళ్లిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారంటూ పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సాంప్రదాయ దుస్తుల్లో దండలు మార్చుకుంటున్నట్లుగా ఉన్న ఫొటోలు చూసిన నెటిజన్లు నిజంగానే వీరు పెళ్లిపీటలెక్కారనుకుని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కానీ అసలు నిజమేంటంటే.. రణ్‌బీర్‌, ఆలియాల పెళ్లి వార్త ఉట్టి పుకారు మాత్రమే. అభిమానులు ఈ ప్రేమజంట ఫొటోలను ఎడిట్‌ చేసి వాళ్లకు పెళ్లైపోయినట్లు ప్రచారం మొదలుపెట్టారు. ఎందుకిదంతా చేశారంటే ఇది ఏప్రిల్‌ ఫూల్స్‌ డేలో భాగమే అంటున్నారు. దీంతో అప్పటివరకు అదంతా నిజమేనని నమ్మిన నెటిజన్లు ఏప్రిల్‌ ఫూల్స్‌ అనగానే సరదాగా నవ్వేస్తున్నారు.

చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పుకార్లపై ఆలియా భట్‌ క్లారిటీ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top