రామ్‌చరణ్‌కు కరోనా నెగెటివ్‌

Ram Charan Recovers From Coronavirus, Tests Negative - Sakshi

కరోనా బారిన పడ్డ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఎట్టకేలకు కోలుకున్నారు. కరోనాను జయించిన విషయాన్ని మంగళవారం నాడు ఆయన స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించారు. ఈ మేరకు తాజా టెస్టుల్లో తనకు కరోనా నెగెటివ్‌ వచ్చిందని తెలిపారు. ఎప్పుడెప్పుడు సెట్స్‌లో అడుగు పెట్టాలా? అని ఎదురు చూస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. తను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా చెర్రీకి డిసెంబర్‌ 29న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆయన కరోనా సంకెళ్లు తెంచుకోవడంతో జెట్‌ స్పీడ్‌తో షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. ఇదిలావుంటే మెగా ఫ్యామిలీలో వరుణ్‌ తేజ్‌కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. (చదవండి: మెగా కుటుంబాన్ని వెంటాడుతున్న కరోనా)

కాగా రామ్‌చరణ్.. మెగాస్టార్‌ చిరంజీవి 'ఆచార్య'లో ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. అలాగే జక్కన్న ప్రతిష్టాత్మకంగా చెక్కుతున్న‌ 'రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్)‌' సినిమాలోనూ నటిస్తున్నారు. ఇందులో చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్‌ ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌ పాత్రలో ఆకట్టుకోనున్నారు. బాలీవుడ్‌ అగ్ర హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ సినిమాను కీలక మలుపు తిప్పే పాత్రలో కనిపించనున్నారు. (చదవండి: యూట్యూబ్‌ ఛానల్‌ హ్యాక్‌: లాస్య తురుము అంతే..)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top