Shankar-Ram Charan Movie: ముఖ్యమంత్రిగా రామ్‌ చరణ్‌!

Ram Charan Play CM Character In Shankar Movie news - Sakshi

సౌత్ టాప్ డైరెక్టర్ శంకర్ గురించి తెల్సిందే. సినిమా ఏదైనా భారీతనం ఉట్టిపడాల్సిందే. హీరో క్యారెక్టరైజేషన్ పవర్ ఫుల్ గా ఉండాల్సిందే. ప్రస్తుతం రామ్‌ చరణ్ కోసం అలాంటి క్యారెక్టర్ ను డిజైన్ చేస్తున్నాడట శంకర్. దిల్‌ రాజు బ్యానర్‌లో రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. రామ్ చరణ్ కు జోడిగా కియారా అడ్వాని పేరు ఖరారు కానుందని టాక్. అలాగే ఈ పాన్ ఇండియా చిత్రాన్ని దిల్ రాజు 500 కోట్లతో తెరకెక్కిస్తున్నాడట.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ న్కూస్‌ ఫిల్మీ దునియాలో చక్కర్లు కొడుతోంది. 20 ఏళ్ల క్రితం వచ్చిన ఒకే ఒక్కడు కు,సీక్వెల్‌గా చెర్రీ మూవీని తెరకెక్కించాలనుకుంటున్నారట. ఈ మూవీలో చరణ్ మొదట కలెక్టర్ పాత్రలోనూ, ఆ తర్వాత సీఎంగా మారి వ్యవస్థలోని లోపాలను ఎలా సరిచేస్తాడు అనేది శంకర్ తనదైన శైలిలో చూపించబోతున్నాడట. అంతేకాదు ఈ మూవీలో ముఖ్యమైన పాత్ర కోసం చిరును ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top