సమంత రూట్‌లోనే ప్రభాస్.. ఆ నిర్ణయం తీసుకోబోతున్నాడా? | Sakshi
Sakshi News home page

Prabhas: షాకింగ్ డెసిషన్.. కానీ ఓ రకంగా ఇది మంచిదే!

Published Wed, Jan 31 2024 1:04 PM

Prabhas To Take Break From Acting After Kalki Movie Shoot - Sakshi

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 'సలార్'తో హిట్ కొట్టి మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన డార్లింగ్ హీరో.. ప్రస్తుతం 'కల్కి' షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు 'రాజా సాబ్' కూడా లైన్‌లో ఉంది. ఈ ఏడాది ప్రభాస్ నుంచి రెండు చిత్రాలు రాబోతున్నాయని ఫ్యాన్స్ సంతోషించేలోపే వాళ్లకు ఓ బ్యాడ్ న్యూస్ కూడా వినిపించింది.

'బాహుబలి' ముందు వరకు ప్రభాస్ అంటే తెలుగోళ్లకు మాత్రమే తెలుసు. కమర్షియల్ మూవీస్ చేసుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఇతడు.. 'బాహుబలి' దెబ్బకు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దీని తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్', 'సలార్'.. ఇలా అన్నీ భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ వచ్చాడు. రిజల్ట్ సంగతి పక్కనబెడితే వీటితో తన రేంజు చాలా పెంచేసుకున్నాడు.

(ఇదీ చదవండి: ప్రభాస్ విచిత్రమైన రికార్డ్.. సెకనుకు రూ.80 లక్షల రెమ్యునరేషన్?)

అయితే పాన్ ఇండియా సినిమాల షూటింగ్ వల్ల ప్రభాస్‌కి విరామం అనేది లేకుండా పోయింది. ఎప్పుడు చూడు.. షూటింగ్స్, షూటింగ్స్ అని హడావుడిలోనే ఉండేవాడు. గతంలో మోకాలికి అయినా గాయానికి విదేశాల్లో సర్జరీ చేసుకుని వచ్చాడు గానీ మళ్లీ షూటింగ్స్ బిజీలో పడిపోయాడు. అయితే త్వరలో మాత్రం లాంగ్ బ్రేక్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట.

'కల్కి'లో తన పార్ట్ షూటింగ్ పూర్తయిన తర్వాత కొన్నాళ్ల పాటు నటనకు విశ్రాంతి ఇవ్వబోతున్నాడట. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ప్రభాస్‌కి కూడా ఇది ఓ రకంగా మంచిదే అని చెప్పొచ్చు. కొన్నాళ్ల ముందు హీరోయిన్ సమంత కూడా ఇలానే బ్రేక్ తీసుకుంది. మళ్లీ వచ్చి ఇప్పుడు యాక్టింగ్ చేసుకుంటోంది. మరి ప్రభాస్ బ్రేక్ విషయంలో నిజమేంటనేది మాత్రం తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: కుమారి ఆంటీ పుడ్ బిజినెస్ క్లోజ్.. సాయం చేస్తానంటున్న తెలుగు హీరో)

Advertisement
 
Advertisement