తాగుడుకు బానిసయ్యా, కానీ: పూజాభట్‌

Pooja Bhatt Opens Up On Her Battling With Alcoholic - Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత మహేశ్‌ భట్‌ కూతురు, నటి పూజాభట్‌ మద్యానికి బానిసయ్యాననని, అయితే దాని నుంచి బయటప పడేందుకు తను చేసిన ప్రయత్నం ఓ పోరాటమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తండ్రి మహేశ్‌ భట్‌ దర్శకత్వంలో ఆమె నటించిన ‘దిల్‌ హై కి మంతా నహీన్‌’ మూవీ జూలై 12తో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ మూవీ సంబంధించిన విషయాలను, తనకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. అయితే ఈ సినిమాలో పూజ మద్యానికి బానిసైన తండ్రిని కాపాడుకునే కూతురి పాత్ర పోషించింది.

ఈ నేపథ్యంలో ఈ మూవీలో తన క్యారెక్టర్‌ గురించి మాట్లాడుతూ నిజ జీవితంలో తాను కూడా మద్యానికి బానిసైయినట్లు వెల్లడించింది. ‘ఈ సినిమాలో విపరీతంగా మద్యం సేవించే తండ్రిని దానిని నుంచి ఆయనను బయటక పడేసే కూతురి పాత్రలో నటించాను. ఇందులో మాదిరిగానే నేను కూడా నిజం జీవితంలో విపరీతంగా మద్యం సేవించేదాన్ని. అయితే నాలుగేళ్ల క్రితమే మానేశాను. దానిని నుంచి బయట పడాలనుకన్నాను. ఆ సమయంలో మద్యం నుంచి నా ఆలోచలను బయట పడేయడం చాలా కష్టంగా ఉండేది. చెప్పాలంటే అది ఒక పోరాటం’ అంటూ చెప్పుకొచ్చారు.

అంతేగాక ‘ఇలాంటి విషయాలను ఆడవాళ్లు బయటకు చెప్పడానికి భయపడుతుంటారు. కానీ ఈ సమస్య ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకే ఆడవాళ్లు ఈ విషయంపై నోరు విప్పాల్సిన అవసరం ఉంది. వారికి స్ఫూర్తిని నింపాలనే ఇప్పుడు నేను దీనిపై నేను పెదవి విప్పాల్సి వచ్చింది. కానీ నేను తాగుడు నుంచి బయట పడేందుకు పోరాటమే చేశాను’ అని పూజ అన్నారు. కాగా మహేశ్‌ భట్‌ దర్శకత్వంలో వచ్చిన ‘దిల్‌ హై కి మంతా నహీన్‌’ మూవీ పూజ భట్‌ లీడ్‌ రోల్‌ పోషించగా, తండ్రి పాత్రలో అనుపమ్‌ ఖేర్‌ నటించాడు. ఇందులో ఆమీర్‌ ఖాన్‌ హీరో. అయితే ఈ సినిమాను తన నిజ జీవితం నుంచి ప్రేరణ పొంది రూపొందించినట్లుగా మహేష్‌ భట్‌ పలు ఇంటర్య్వూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top