ఇద్దరు భామలతో పెద్ది స్టెప్పులు.. ఐటం సాంగ్‌ చూశారా? | Peddi Movie: Ram Charan, Janhvi Kapoor, Shruti Haasan Galulalo Song Out | Sakshi
Sakshi News home page

పెద్ది ఐటం సాంగ్‌: శృతి హాసన్‌తో రామ్‌చరణ్‌ అదిరిపోయే డ్యాన్స్‌..

May 24 2026 11:09 AM | Updated on May 24 2026 11:17 AM

Peddi Movie: Ram Charan, Janhvi Kapoor, Shruti Haasan Galulalo Song Out

రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా పెద్ది. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ కథానాయిక. బుచ్చిబాబు డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ నుంచి వరుస సర్‌ప్రైజ్‌లు వదులుతున్నారు. మొన్న ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఆ తర్వాత స్పెషల్‌ సాంగ్‌ 'హల్లల్లల్లో హల్లో..' ప్రోమో వదిలారు. తాజాగా ఈ పాట ఫుల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. 

ఇద్దరు హీరోయిన్లతో డ్యాన్స్‌
ఈ ఐటం సాంగ్‌లో శృతి హాసన్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా మెరిసింది. ఇక పెద్ది.. అటు శృతి హాసన్‌తో, ఇటు జాన్వీ కపూర్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులేశాడు. ఈ పాటకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించగా అనంత్‌ శ్రీరామ్‌ లిరిక్స్‌ సమకూర్చాడు. సింగర్‌ రక్షిత సురేశ్‌ ఎంతో హుషారుగా ఆలపించింది. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించాడు. ఇక పెద్ది విషయానికి వస్తే.. శివరాజ్‌కుమార్‌, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ జూన్‌ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 

చదవండి: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్‌చరణ్‌

Advertisement
 
Advertisement
Advertisement