నాగ చైతన్య సరికొత్త రికార్డు.. అక్కినేని ఫ్యాన్స్‌ అభినందనలు

Naga Chaitanya Reached 7 Million Followers In Instagram - Sakshi

టాలీవుడ్‌కి చెందిన చాలా మంది స్టార్‌ హీరోలు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తమ సినిమా కబుర్లతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. అలాంటి వారిలో యంగ్‌ హీరో నాగచైతన్య ఒకరు. వరస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటాడు ఈ అక్కినేని హీరో. కెరీర్‌ విషయాలతో పాటు ఫోటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తన ఫాలోవర్స్‌ని అట్రాక్ట్‌ చేస్తుంటాడు. దీంతో నెట్టింట్‌ చైతూ ఫాలోయింగ్‌ రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా ఈ అక్కినేని హీరో ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్స్‌పైగా ఫాలోవర్లను రీచ్‌ అయ్యాడు. ఈ ఘనత సాధించిన అతికొద్ది మంది టాలీవుడ్‌ హీరోల జాబితాలో చైతూ చేరాడు. ఈ నేపథ్యంలో అక్కినేని అభిమానులు చైతూకి అభినందనలు తెలియజేస్తున్నారు. 

ఇక సినిమా విషయాలకొస్తే.. ఇటీవల బంగార్రాజు మూవీతో ప్రేక్షకులను పలకరించిన చైతూ.. ఇప్పుడు ‘థ్యాంక్యూ’చెప్పేందుకు సిద్దమవుతున్నాడు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది. మరోవైపు ఓటీటీలోకి కూడా అడుగుపెట్టాడు. అమెజాన్ సంస్థ కోసం 'ధూత' అనే వెబ్ సిరీస్‌ చేస్తున్నాడు.దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top