Love Story Tailer: లవ్‌స్టోరీ ట్రైలర్‌ వచ్చేసింది

Naga Chaitanya And Sai Pallavi Love Story Movie Trailer Out  - Sakshi

Love Story Movie Trailer: అక్కినేని హీరో నాగా చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్‌స్టోరీ. సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంతో తెరకెక్కిన ఈ మూవీ త్వరలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్‌. హీరో నాగ చైతన్య డ్యాన్స్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌లో చై డ్యాన్స్‌ మాస్టర్‌గా కనిపించాడు. సాయిపల్లవి ఎంట్రీ, ఆ తర్వాత  తెలంగాణ యాసలో ఇక బాసండ్లు తోముడే అంటూ తన ఫ్రెండ్‌తో చెప్పే డైలాగ్‌ తెగ ఆకట్టుకుంటోంది. 

ఈ మూవీ సెప్టెంబర్‌ 10న విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ విడుదలను మరోసారి వాయిదా వేశామని, సెప్టెంబర్‌ 24న లవ్‌స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top