ప్రాజెక్ట్‌ స్టార్ట్‌

Nag Ashwin Movie Project K Prabhas To Join Deepika Padukone  - Sakshi

Nag Ashwin Movie Project K: కెరీర్‌లో మరో కొత్త ప్రాజెక్ట్‌ను షురూ చేశారు ప్రభాస్‌. ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌). ఇందులో దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రధారి. ఈ సినిమా చిత్రీకరణలో శుక్రవారం ప్రభాస్‌ జాయిన్‌ అయ్యారని తెలిసింది. కొన్ని నెలల క్రితం ఆరంభమైన ఈ చిత్రం షూటింగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌ మాత్రమే పాల్గొన్నారు. ఓ వారం క్రితం దీపికా పదుకోన్‌ ఎంటర్‌ అయ్యారు. ఇప్పుడు ప్రభాస్‌ కూడా ‘ప్రాజెక్ట్‌ కె’లోకి వచ్చేశారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top