స్టార్‌ నటి బాడీ ట్రాన్స్‌ఫార్మెషన్‌.. బిఫోర్‌, ఆఫ్టర్‌ ఎలా ఉందో చూడండి

Munmun Dutta Shared Her Body Transformation Photos - Sakshi

ప్రుముఖ హిందీ సిట్‌కామ్‌ షో 'తారక్‌ మెహతా కా ఉల్టా చష్మా' స్టార్‌ నటి మున్మున్‌ దత్తా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవల ఆమె తన ఫిజికల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఫొటోలను ఇన్‌స్టా గ్రామ్‌ అకౌంట్‌ ద్వారా షేర్‌ చేసుకున్నారు. ఈ చిత్రాలు ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ టీవీ స్టార్‌ తాను క్రమం తప్పకుండా వర్కవుట్‌ చేస్తున్నానని, ప్రత్యేకమైన డైట్‌ను అనుసరిస్తున్నాని పోస్ట్‌లో తెలిపింది. తాను 30 రోజుల ఫిట్‌నెస్‌ కార్యక్రమంలో చేరి ఎంతో ప్రేరణ పొందారని తెలిపారు. నాలుగు నెలల నుంచి క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం అలవాటైందని పేర్కొన్నారు. అలా చేయడం వల్ల ఇంతకుముందు ఉన్న శరీరాకృతికి వచ్చానన్నారు. 

ఇంకా ఆ పోస‍్టులో 'పరిపూర్ణమైన శరీరాన్ని సాధించడానికి చాలా దూరం ప్రయాణించాలి. కానీ ఇప్పుడు నేను మంచి ప్రేరణతో ట్రాక్‌లో ఉన్నాను. ఇది నాకు ఒక ప్రయాణం కాబోతుంది.' ఇంతకుముందు మున్మున్‌ దత్తా సోషల్‌ మీడియాలో కుల దూషణలు చేసి వార్తల్లో నిలిచారు. ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. అయితే తర్వాత ఉద్దేశపూర‍్వకంగా ఒక కమ్యూనిటీ మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పింది. 

2004లో ఓ టీవీ షో 'హమ్‌ సబ్‌ బరాతీ'తో మున్మున్ దత్తా కెరీర్ ప్రారంభమైంది. ఆమె 2005లో కమల్‌ హాసన్‌ నటించిన ముంబై ఎక్స్‌ప్రెస్‌లో నటించింది. తర్వాత 2006లో హాలిడే చిత్రంలో కనిపించింది. టెలివిజన్‌ సిట్‌కామ్‌ షో 'తారక్‌ మెహతా కా ఉల్టా చష్మా'లో ఆమె బబితా అయ్యర్‌గా నటించారు. ఇది 2008లో ప్రారంభమైనప్పటి నుంచి ఆమె ఇంటి పేరుగా మారింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top