Mohan Babu Letter: ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు కాదు: మోహన్‌ బాబు

Mohan Babu Sensational Comments On Cine Industry - Sakshi

సినీ పరిశ్రమను ఉద్దేశించి సీనియర్ నటుడు మోహన్‌ బాబు బహిరంగా లేఖ రాశారు.  ఇది వరకు అనేక మంది సెలబ్రిటీలు సినీ పరిశ్రమ సమస‍్యలపై తమదైన శైలీలో స్పందించారు. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొందరు టికెట్‌ ధరల విషయంపై ఏపీ మంత్రులతో ఇంకా చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో ఎవరూ కూడా ఈ విషయంపై మాట్లాడొద్దని నిర్మాత దిల్‌ రాజు చెప్పిన సంగతి తెలిసిందే.  అయితే తాజాగా సీనియర్‌ నటుడు మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా ఒక లేఖ షేర్‌ చేశారు. అందులో అనేక అంశాలను ప్రస్తావించారు. 

'అందరం కలిసి సినిమాను బతికిద్దాం. రెండు రాష్ట్రాల సీఎంలను కలిసి మనకు న్యాయం చేయాలని అడుగుదాం. మా అందరికీ నిర్మాతలు దేవుళ్లు. కానీ ఈరోజు నిర్మాతలు ఏమయ్యారు. అసలు ప్రొడ్యూసర్‌ కౌన్సిల్ సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదు. సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదు.' అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 

ఇదీ చదవండి: చిరు వ్యాఖ్యలపై బండ్ల గణేష్‌ ఆసక్తికర కామెంట్‌.. అవి రిపీట్‌ చేస్తూ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top