Chiranjeevi Role In Viswambhara: మెగా ఎక్సపర్మెంట్‌ చేసేందుకు సిద్ధమైన చిరంజీవి

Megastar Chiranjeevi Experiment For Upcoming Movie - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి 'విశ్వంభర' చిత్రం షూటింగ్‌ షెడ్యూల్స్‌ బిజీగా జరుగుతున్నాయి. చాలారోజుల నుంచే ఈ చిత్రానికి సంబంధించిన పలు సీన్స్‌ చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్‌ వశిష్ఠ. బింబిసార చిత్రంతో సూపర్‌ హిట్‌ కొట్టిన ఆయన ఈ చిత్రంతో మరో భారీ హిట్‌ కొట్టేందుకు మంచి కథను సిద్ధం చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితమే ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌లోకి మెగా​స్టార్‌ చిరంజీవితో పాటు త్రిష కూడా అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో చిరు పోస్ట్ చేశారు. 

ఇప్పటివరకూ చిరంజీవి నటించిన సినిమాలతో పోలిస్తే ఈ విశ్వంభరలో ఆయన సరికొత్త పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.    ఈ సినిమాలో  ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలు ప్రధానంగా అందరినీ ఆకర్షిస్తాయిని తెలుస్తోంది. అందులో మెగాస్టార్‌ సుమారు 70 ఏళ్ల వయసుకు మించిన లుక్‌లో కనిపిస్తారనే వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వృద్ధుడి పాత్రలో కనిపించి మరో ప్రయోగానికి మెగాస్టార్‌ తెరలేపుతున్నట్లు తెలుస్తోంది. విశ్వంభరలో ఆ పాత్ర కీలకంగా మారనుందట. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీని డైరెక్టర్‌ తెరకెక్కిస్తున్నారు.

దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘విశ్వంభర’ తీర్చిదిద్దుతున్నట్లు టాక్‌. సోషియో ఫాంటసీ మూవీ కావడంతో వీఎఫ్‌ఎక్స్‌పై డైరెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు సమాచారం. విశ్వంభర సినిమా చిరంజీవి కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోయేలా వశిష్ఠ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.  యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై వస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.

whatsapp channel

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top