థియేటర్లలో విడుదల కానున్న ‌లెగసీ ఆఫ్‌ లైస్

Legacy of Lies Hollywood Movie Remake In Hindi With Agent M60 - Sakshi

స్కాట్‌ ఆడికిన్స్‌, అన్నా బత్కెవిచ్, యూలియా ముఖ్య తారలుగా ఆండ్రియన్‌ బోల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన హాలీవుడ్‌ చిత్రం ‘లెగసీ ఆఫ్‌ లైస్‌’. ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్‌ 5 ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. నెట్‌ 5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అయినప్పటికీ ముందుగా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నెట్‌ 5 సీవోఓ బల్వంత్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘ఎమోషనల్‌ యాక్షన్‌  ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

హిందీలో ‘ఏజెంట్‌ ఎం-6’ పేరుతో రిలీజ్‌ అవుతుంది. మా చిత్రం ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుందనే నమ్మకం ఉంది. మా ఓటీటీ సొంతం చేసుకున్న ఇంగ్లీష్‌ సినిమాల్లో కొన్నింటిని ప్రధాన భారతీయ భాషలన్నింటిలోనూ అనువదించి విడుదల చేయాలన్నది మా సంకల్పం. ఓటీటీ కంటే థియేటర్లలో ముందు విడుదల చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. థిమేటర్లలో విడుదలైనా ఆ తర్వాత ఓటీటీలోనూ రిలీజ్‌ చేసుకోవచ్చు’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top