Nizam Director: తనికెళ్ల భరణి స్ఫూర్తితో దర్శకుడినయ్యా

Kona Ramesh Nizam Movie Launched - Sakshi

సంజయ్, రవికిరణ్, సార ప్రధాన పాత్రల్లో కోన రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నైజం’. ‘ట్రూత్‌ ఆఫ్‌ లైఫ్‌’ అనేది క్యాప్షన్‌. కాండ్రేగుల చందు, ఆంజనేయ ఎన్నంశెట్టి, లగుడు లోవ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కళావేదిక చైర్మన్‌ కత్తి మండప్రతాప్‌ కెమెరా స్విచ్చాన్‌ చేసి, క్లాప్‌ కొట్టారు.

కోన రమేష్‌ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘తనికెళ్ల భరణిగారి స్ఫూర్తితో దర్శకుడినయ్యా. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న సినిమా ‘నైజం’’ అన్నారు రమేష్‌. ‘‘సింగిల్‌ షెడ్యూల్‌లో మా మూవీ షూటింగ్‌ పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. సంజయ్, సంగీత దర్శకుడు మోహన్‌కుమార్, సార పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top