కియారాతో మూడు సినిమాలకు డీల్‌ కుదుర్చుకున్న శంకర్‌!

Kiara Advani Agree For Three Film Projects With Shankar - Sakshi

పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఓ కథానాయికను పరిచయం చేసేటప్పుడు వరుసగా తమ సంస్థకు రెండు, మూడు సినిమాలు చేయాలని నిబంధన పెడుతుంటాయి. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్‌ కూడా ఇప్పుడు కియారా అద్వానీతో ఇలా మూడు సినిమాలకు డీల్‌ కుదుర్చుకున్నారని సమాచారం. అయితే నిబంధన అనలేం కానీ ఇష్టపూర్వకంగా శంకర్‌ ప్రతిపాదనను కియారా అంగీకరించారట.

ఆఫర్‌ అలాంటిది మరి! తెలుగులో రామ్‌చరణ్‌ హీరోగా తాను దర్శకత్వం వహించనున్న సినిమాలోనూ, అటు హిందీలో రణ్‌వీర్‌ సింగ్‌తో చేయనున్న అపరిచితుడు రీమేక్‌లోనూ కథానాయికగా కియారాను తీసుకున్నారట శంకర్‌. మరి.. మూడో సినిమా ఏంటనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి అగ్రదర్శకుడితో కియారా ట్రిపుల్‌ ధమాకా ఆఫర్‌ అందుకోవడం విశేషమే!

చదవండి: నగ్నంగా దర్శనమిచ్చి షాకిచ్చిన స్టార్‌ హీరోయిన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top