రష్మికకు ఊహించని సర్‌ప్రైజ్.. దెబ్బకు సైలెంట్ అయిపాయే! | Sakshi
Sakshi News home page

Rashmika: వాళ్లు చేసిన పనికి షాకైన హీరోయిన్ రష్మిక.. వీడియో వైరల్

Published Fri, Mar 1 2024 5:52 PM

Japan Fans Surprise Rashmika Video Viral - Sakshi

పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక ఫుల్ బిజీగా ఉంది. రెండు నెలల క్రితం 'యానిమల్' మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్‌లో పాల్గొంటోంది. చిన్న గ్యాప్ దొరకడంతో జపాన్‌లోని టోక్యోకి వెళ్లింది. క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ వేడుకకు ఆహ్వానం రావడంతోనే అక్కడికి వెళ్లింది. అయితే రష్మికని జపాన్ ఫ్యాన్స్ వేరే లెవల్‌లో సర్‌ప్రైజ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోనే వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?)

టోక్యోలో శనివారం, క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ వేడుక జరగనుంది. గ్లోబల్ ఈవెంట్ గా జరుగుతున్న ఈ కార్యక్రమానికి భారత్ నుంచి రష్మిక రిప్రెజంట్ చేస్తోంది. తద్వారా ఈ గౌరవం దక్కిన ఏకైక నటిగా నిలిచింది. అయితే టోక్యో విమానశ్రయంలోనే ఈమెకు.. జపాన్ ఫ్యాన్స్ అద్భుతమైన స్వాగతం చెప్పారు. రష్మిక ఫొటోస్‌తో డిజైన్ చేసిన ఫ్లకార్డులు చూపిస్తూ ఆమెను ఆహ్వానించారు. 

జపాన్ ఎయిర్‌పోర్ట్‌లో తనకు ఈ రేంజ్ స్వాగతం దక్కడం చూసి రష్మిక షాక్ అయిపోయింది. నోట మాట రాలేదు. కాసేపటికి తేరుకుని తన అభిమానులకు హాయ్ చెప్పింది. ఎన్టీఆర్, ప్రభాస్, రానా తదితర స్టార్స్ తర్వాత రష్మికకే జపాన్‌లో ఈ తరహా ఫ్యాన్స్ ఉన్నారు. ఏదేమైనా రష్మిక క్రేజ్ జపాన్ వరకు వెళ్లడం చూస్తుంటే వేరే లెవల్ అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ షోకి వెళ్లొచ్చాక నన్ను బ్యాన్ చేశారు: అలీ రెజా)

Advertisement
Advertisement