Ghani Krishnatej: లవ్‌.. సస్పెన్స్‌

husharu Fame Ghani Krishna Tej New Movie Updates - Sakshi

‘హుషారు’ఫేమ్‌ గనికృష్ణ తేజ్, అఖిల ఆకర్షణ జంటగా వెంకట్‌ వందెల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కింది. ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌  పనులు జరుపుకుంటోంది.

వెంకట్‌ మాట్లాడుతూ – ‘‘లవ్, సస్పెన్స్‌ మూవీ ఇది. ఇటీవల హైదరాబాద్‌ శివారుల్లో ఓ సెట్‌ వేసి అందులో ఓ పాట చిత్రీకరించాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌  పనులు తుది దశలో ఉన్నాయి’’ అన్నారు. ‘‘త్వరలోనే టైటిల్, రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: సందీప్‌ కుమార్, నిర్మాణ సారథ్యం: ముల్లేటి నాగేశ్వరరావు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top