Rekha Boj: 'సామీ సామీ' పాట కోసం రెండు గాజుల‌మ్ముకున్న హీరోయిన్‌

Heroine Rekha Boj Cover Song On Saami Saami Song - Sakshi

Saami Saami Cover Song By Rekha Boj: న‌ట‌న‌ను న‌మ్ముకుంటూ సినిమాల్లోకి వ‌చ్చిన‌వాళ్లెంద‌రో! ఒక్క ఛాన్స్ కోసం ఇప్ప‌టికీ నిరీక్షిస్తున్న వాళ్లెంద‌రో! అయితే ఛాన్సులు వ‌స్తున్నా మంచి గుర్తింపు కోసం తాప‌త్ర‌య ప‌డుతున్న‌ వాళ్లింకెంద‌రో! హీరోయిన్ రేఖా భోజ్ కూడా ఈ మూడో ర‌కం కోవ‌లోకే వ‌స్తుంది. దామిని విల్లా, రంగేలా, క‌ళ్యాణ త‌స్మై న‌మ‌హః వంటి చిత్రాల్లో న‌టించిన హీరోయిన్ రేఖా భోజ్ పెద్ద‌గా గుర్తింపు సంపాదించ‌లేక‌పోయింది. కానీ సోష‌ల్ మీడియాను మాత్రం ప‌బ్లిసిటీకి ఫుల్లూగా వాడేసుకుంటోంది. తాజాగా ఆమె పుష్ప చిత్రంలోని సామీ.. సామీ.. పాట‌కు క‌వ‌ర్ సాంగ్ చేసింది.

ఒరిజిన‌ల్ సాంగ్‌ను త‌ల‌ద‌న్నేలా ఉండాల‌ని ఎంత‌గానో క‌ష్ట‌ప‌డింది. ఈ క్ర‌మంలో ఏకంగా త‌న రెండు గాజులు కూడా అమ్ముకుంద‌ట‌. 'చాలా క‌ష్ట‌ప‌డి చేశాను.. రెండు గాజులు అమ్ముకున్నా.. మీకు న‌చ్చితే మీ సోష‌ల్ మీడియాలోఒక్క షేర్ చేసి స‌పోర్ట్ చేయండి' అని పోస్ట్ పెట్టింది రేఖా భోజ్. ఈ  క‌వ‌ర్ సాంగ్‌లో క‌ట్టు బొట్టు, లొకేష‌న్స్, డ్యాన్స్‌ అన్నీ కూడా స‌రిగ్గా స‌రిపోవ‌డంతో ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top