Sukumar: సుకుమార్‌ భార్య తబిత బర్త్‌డే వేడుకలు..ఫోటోలు వైరల్‌

Director Sukumar Wife Thabitha Birthday Celebrations - Sakshi

Director Sukumar Wife Thabitha Birthday Celebrations క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ భార్య తబిత సుకుమార్‌ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. కుటుంబ సభ్యులతో కలిసి తబిత బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకున్నారు. భార్య కోసం సుకుమార్‌ తాజ్‌ ఫలక్‌ నామాలో సర్‌ప్రైజ్‌ పార్టీ ఇచ్చినట్లు సమాచారం. 'మీ ఆత్మీయుల మధ్య ఉన్నప్పుడు ఏ వేడుక అయినా అద్భుతంగా జరుగుతుంది' అంటూ తబిత బర్త్‌డే ఫోటోలను షేర్‌చేసింది.

ఇక 2009లో సుకుమార్‌, తబితను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి సుకృతి, సుకృత్‌ పిల్లలు. ప్రస్తుతం తబిత లాండ్రీ కార్డ్‌ పేరుతో ఆన్‌లైన్‌ బిజినెస్‌ చేస్తున్నారు. ఇప్పటికే 'లాండ్రీ కార్డ్‌' పేరుతో మూడు బ్రాంచ్‌లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సుకుమార్‌ రైటింగ్స్‌ బాధ్యతల్ని కూడా ఆమె చూస్తున్నారు.ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సుకుమార్‌ పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ పార్ట్‌ ఈ ఏడాది డిసెంబర్‌25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top