డైరెక్టర్‌ శంకర్‌ తల్లి ముత్తు లక్ష్మి కన్నుమూత

Director Shankat Mother Died At 88 - Sakshi

ప్రముఖ డైరెక్టర్‌ శంకర్‌ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి ముత్తు లక్ష్మి (88) మంగళవారం సాయంత్రం చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మే 18న తుదిశ్వాస విడిచారు. దీంతో కోలీవుడ్‌, టాలీవుడ్‌తో పాటు పలు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు  సోషల్‌ మీడియా వేదికగా ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు.

శంకర్ ఈ స్థాయిలో ఉండటానికి కారణం తన తల్లి ముత్తు లక్ష్మి అని పలు ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పేవారు. తన చిన్న వయసులో ఎన్నో కష్టాలుపడి పెంచి తనను ఈ స్థాయి తీసుకొచ్చారంటూ ఆయన తరచూ తల్లిని గుర్తు చేసుకునేవారు. కాగా ఇప్పటికే కరోనా కారణంగా తమిళ సినీ పరిశ్రమ నటీనటులు, దర్శక నిర్మాతలను కోల్పోయింది. ఈ తరుణంలో తాజాగా శంకర్ తల్లి మృతి వార్త మరింత విషాదాన్ని నింపింది. ప్రస్తుతం శంకర్‌ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తో పాన్‌ ఇండియా చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ఆయన ‘ఇండియన్‌ 2’ మూవీ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించే పనిలో పడ్డారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top