వైరల్‌ : రాహుల్‌ ప్రధాని అవుతారు దీపిక

Deepika Padukone praising Rahul Gandhi Old Video - Sakshi

సాక్షి, ముంబై : చిత్రపరిశ్రమలో ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపిక పదుకొనెకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేత రాహుల్‌ గాంధీపై ఆమె ప్రశంసలు కురిపించిన వీడియో ఒక్కటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ జాతీయ మీడియా గతంలో నిర్వహించిన ఇంటర్య్వూలో రాహుల్‌పై దీపిక పలు వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్‌లో అతను దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు నిండుగా ఉన్నాయని, తనకు ఇష్టమైన నేతల్లో రాహుల్‌ ముందుంటారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అసలైన దేశభక్తి తనకు రాహుల్‌లో కనిపిస్తుందని, యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మంచి నాయకుడికి ఆయనే సరైన  ఉదాహరణ అని, ప్రధానమంత్రి అవుతారనే నమ్మకం తనకు ఉందన్నారు. (దీపికకు నోటీసుల వెనుక ఇంత కుట్రనా..)

అయితే డ్రగ్స్‌ కేసులో భాగంగా శనివారం దీపిక విచారణ ముగిసినప్పటి నుంచి ఈ వీడియో వైరల్‌గా మారింది. ఓ వర్గానికి చెందిన వారు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. జేఎన్‌యూ ఘటనపై కూడా దీపిక విపరీతమైన విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కాగా సుశాంత్‌ సింగ్‌ అనుమానాస్పద మృతి అనంతరం వెలుగులోకి వచ్చిన మాదక ద్రవ్యాల కేసులో ఎన్‌సీబీ విచారణ ప్రక్రియను వేగవంతం చేసింది. దీనిలో భాగంగానే నటీమణులు రకుల్‌ ప్రీత్‌సింగ్‌, దీపిక పదుకొనె, సారా అలీఖాన్‌, శ్రద్ధా కపూర్‌లను విచారించింది. వీరి నుంచి కీలకమైన సమాచారాన్ని అధికారులు రాబట్టినట్టు తెలుస్తోంది. (రకుల్‌పై ప్రశ్నల వర్షం : ఏం చెప్పింది?)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top