వివాదంలో అల్లరి నరేశ్‌ సినిమా

Controversy Over Allari Naresh Latest Movie Bangaru Bullodu - Sakshi

అల్లరి నరేశ్‌ హీరోగా నటించిన ' బంగారు బుల్లోడు' చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలపై  స్వర్ణ కార సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ వృత్తిని కించపరిచేలా చూపించిన కొన్ని సీన్లను సినిమాలోంచి  తొలగించాలని కోరుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘాలు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు గురువారం స్వర్ణ కార సంఘాలు వినతి పత్రాలు అందజేశాయి. ఒకరి బంగారు ఆభరణాలను వేరొకరి వేడుకలకి స్వర్ణకారులు ఇవ్వరని.. అలా ఇస్తున్నట్టు ట్రైలర్‌లో చూపించి స్వర్ణకారులను కించపరిచారని ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ పేర్కొన్నారు. (బంగారు బుల్లోడు: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ )

స్వర్ణ కారులపై ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నా వెంటనే వాటిని తొలగించాలని తెలిపారు. అంతేకాకుండా రిలీజ్‌కు ముందు ప్రివ్యూ వేయాలని, లేదంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇక ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు గిరి పి దర్శకత్వం వహించారు. అల్లరి నరేశ్‌కు జోడీగా హీరోయిన్‌ పూజా జవేరీ నటించింది. ఈనెల 23న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. (నా బెండ్‌ తీశాడు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top