VJ Sunny Home Tour: బిగ్‌బాస్‌ ఫేమ్‌ వీజే సన్నీ ఇల్లు చూసేయండి!

Bigg Boss Telugu 5: VJ Sunny Home Tour - Sakshi

Bigg Boss 5 Fame VJ Sunny Home Tour: అప్పుడే సరదాగా ఉంటాడు, అప్పుడే చిర్రుబుర్రులాడుతుంటాడు. కోపమొస్తే ఒంటికాలిపై లేచి విశ్వరూపం చూపించే అతడు కొద్ది క్షణాలకే చప్పున చల్లారిపోయి కలిసుందాం రా అంటాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఫిదా చేస్తూ, మెచ్యురిటీ లెవల్స్‌తో మెస్మరైజ్‌ చేసే అతడు ఎవరో మీకీపాటికే అర్థమై ఉంటుంది. అతడు మరెవరో కాదు ప్రస్తుతం బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వీజే సన్నీ! కెప్టెన్‌ అవ్వాలన్న ఆశను ఎట్టకేలకు ఏడోవారంలో నెరవేర్చుకున్నాడు సన్నీ. మరోసారి కెప్టెన్‌ అయ్యేందుకు సైతం పొటీపడుతున్నాడు.

ఇదిలా వుంటే హైదరాబాద్‌లో అతడు నివాసముండే ఫ్లాట్‌ను చూపిస్తూ 'సాక్షి టీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌' ఓ స్పెషల్‌ వీడియో చేసింది. సన్నీ తన ఫ్రెండ్‌తో నివాసముండే ఆ ఫ్లాట్‌లో ఒ​క హాల్‌, కిచెన్‌, మూడు బెడ్‌రూమ్స్‌, ఒక పూజ గది ఉన్నాయి. రెండు బెడ్‌రూమ్స్‌లో సన్నీ, అతడి స్నేహితుడు నరేశ్‌ ఉండగా మూడో బెడ్‌ రూమ్‌ ఖాళీగా ఉంటుంది. హాల్‌ చివర్లో వర్కవుట్స్‌ చేసేందుకు ఖాళీ స్థలం కూడా ఉంది.

సన్నీకి ఎక్కువగా రైడింగ్‌ అంటే ఇష్టమున్నట్లుంది. అందుకే ఎక్కడ చూసినా కారు, బైక్‌ బొమ్మలే దర్శనమిచ్చాయి. అతడి బెడ్‌రూమ్‌లో అయితే బుల్లెట్‌ బండి స్టిక్కర్‌తో పాటు ఓ కొటేషన్‌ కూడా అతికించి ఉంటుంది. ఇక చాలా గదుల్లో బుద్ధుడి బొమ్మలు దర్శనమివ్వడం అతడు శాంతిని కోరుకున్నట్లు తెలుపుతోంది. చెగువేరా ఫొటో కూడా అతికించి ఉండటాన్ని బట్టి సన్నీ అతడిని స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాచిలర్‌ రూమే అయినప్పటికీ సన్నీ తన గదిని ఎంతో శుభ్రంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top