
ఈ మధ్యే ఓ వీడియోలో త్వరలో ఇండియాకు రాబోతున్నానని చెప్పింది. అంటే తను బిగ్‌బాస్‌కు వచ్చే ఛాన్స్ ఉందేమో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ని
బిగ్‌బాస్.. ఈ పేరు చెప్తే చాలు కొందరు తెగ ఎగ్జయిట్ అయిపోతుంటారు. ఆ మ్యూజిక్ వినగానే వారిలో ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. వాళ్లే బిగ్‌బాస్ ప్రేమికులు.. ఈ రియాలిటీ షోలో ముక్కూమొఖం తెలియనివారిని పట్టుకొచ్చినా, మరీ ఆలస్యంగా ప్రసారం చేసినా కళ్లప్పగించుకుని మరీ చూస్తారు. ఆ కంటెస్టెంట్లను సెలబ్రిటీలు చేస్తారు. కొందరేమో నచ్చదంటూనే బిగ్‌బాస్ చూస్తారు, అది వేరే విషయం!
స్టార్ మా బిగ్‌బాస్ 7 త్వరలో ప్రసారం కానుందంటూ టైటిల్ లాంచ్ చేసినప్పటి నుంచి ఈ షోపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈసారి షో ఎప్పుడు ప్రారంభం కానుంది? ఎన్నింటికి ప్రసారం చేస్తారు? ఎంతమందిని పట్టుకొస్తారు? మనకు తెలిసినవాళ్లుంటారా? లేదా? ఇలా జనాల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాటిన్నింటికీ బిగ్‌బాసే సమయం వచ్చినప్పుడు సమాధానం ఇస్తాడు.
ఇకపోతే ఎప్పటిలాగే ఈసారి కూడా ఫలానా వాళ్లు షోలో అడుగుపెట్టనున్నారహో అంటూ దరువేసి మరీ ప్రచారం చేస్తున్నారు. ఆ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు బ్యాంకాక్ పిల్ల. యూట్యూబ్ వీక్షించే చాలామందికి ఈ పేరు తెలిసే ఉంటుంది. థాయ్‌లాండ్ దేశంలోని బ్యాంకాక్‌లో నివసించే ఆమె అక్కడ వీధికొట్టు దగ్గర నుంచి వింత ప్రదేశాల వరకు అన్నింటినీ వీడియోలు చేసి జనాలకు చూపిస్తూ ఉంటుంది. ఈమె అసలు పేరు శ్రావణి సమంతపూడి. తన యూట్యూబ్ ఛానల్ పేరు బ్యాంకాక్ పిల్ల. ఈ ఛానల్‌కు రెండు మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
విజయనగరానికి చెందిన ఈమె బ్యాంకాక్‌లో కూడా తన యాసభాషలను వదిలిపెట్టలేదు. విదేశాల్లోనూ చక్కగా మన యాస మాట్లాడుతుండటంతో ఎంతోమంది ఆమెకు ఫిదా అయిపోయారు. ఫలితంగా ఆమె వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. ఈ మధ్యే ఓ వీడియోలో త్వరలో ఇండియాకు రాబోతున్నానని చెప్పింది. అంటే తను బిగ్‌బాస్‌కు వచ్చే ఛాన్స్ ఉందేమో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ నిజంగానే ఈ బ్యాంకాక్ పిల్ల బిగ్‌బాస్‌కు వస్తే ఆ సందడే వేరే, అందరూ ఆమె మాటల ప్రవాహంలో పడి కొట్టుకుపోవాల్సిందే! అంటున్నారు అభిమానులు. మరి నిజంగానే బ్యాంకాక్ పిల్ల బిగ్‌బాస్ 7లో ఉంటుందా? లేదా? అనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే!
చదవండి: 13 ఏళ్లకే సినిమాల్లోకి.. రూ10 పారితోషికం నుంచి స్టార్ హీరోలతో సమానంగా!
గ్లామర్ హీరోయిన్.. నిర్మాత ఒత్తిడితో వ్యభిచార కూపంలోకి..