భార్గవ్.. మమ్మల్ని రూమ్ నుంచి వెళ్లగొట్టాడు, ఎందుకంటే

ఫన్ బకెట్ భార్గవ్ బండారం బయటపెట్టిన మాజీ ప్రేయసి, స్నేహితులు
ఫన్ బకెట్ భార్గవ్.. మొన్నటివరకు అతడి వీడియోలు చూసి జనాలు సరదాగా నవ్వుకునేవారు. కానీ ఇప్పుడతడి పేరు ఎత్తితే చాలు మండిపోతున్నారు. ఫేమస్ చేస్తానని, చాన్సులు ఇప్పిస్తానంటూ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. చెల్లీ అంటూనే ఆమె బతుకును నాశనం చేశాడు. దీనిపై విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక ఈ విషయం దావానంలా వ్యాపించగా అతడి చేతిలో మోసపోయింది ఈవిడే అంటూ పలువురు పేర్లు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో వారు ఆ బాధితురాలిని నేను కాదంటూ వీడియోలతో క్లారిటీ ఇచ్చారు.
ఇదిలా వుంటే భార్గవ్ బండారాన్ని అతడి మాజీ ప్రేమికురాలు బయటపెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడితో పని చేసిన అమ్మాయిల వల్లే భార్గవ్‌కు పేరుప్రఖ్యాతలు వచ్చినప్పటికీ వారిని కొంచెం కూడా గౌరవించడని భార్గవ్ వ్యక్తిత్వాన్ని చెప్పింది. అతడో పెద్ద వుమెనైజర్ అని బాంబు పేల్చింది. "నేనే తోపు, చెడ్డపనులు చేసినా నడుస్తది. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్ ఉంది, సౌత్ ఇండియా సూపర్ స్టార్. నేనేం చేసినా ఎవరూ ఏం చేయలేరు అని ఫీలవుతాడు. పని వర్కవుట్ అవకపోతే సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తాడు. ఏడ్వడం, చేతులు కట్ చేసుకోవడం, దాన్ని వీడియోలు చేయడం.. అంతా పబ్లిసిటీ స్టంట్.. ఇదంతా యాక్టింగ్. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు. రేప్ సినిమాలు చూస్తాడు, కానీ తనో పెద్ద స్త్రీ లోలుడు అన్న విషయాన్ని అంగీకరించడు. అతడి బాధితుల్లో ఒకరికి భర్త కూడా ఉన్నాడు. ఎన్నో పాపాలు చేశాడు. ఆడవాళ్లను తన వీడియోల కోసం చాలా వాడుకున్నాడు" అని పేర్కొంది.
భార్గవ్‌తో కలిసి వీడియోలు చేసిన సయ్యద్ సుమయ ఫరాహత్ కూడా తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసింది. "భార్గవ్‌ను మొదట్లో మంచివాడు అనుకునేదాన్ని. కానీ అతడు వేరే అమ్మాయిలతో చేసే పనులు చూశాను. అవి నాకు నచ్చలేదు. నాకిక్కడ రక్షణ లేదనిపించింది. అందుకే గతేడాది అతడి టీమ్ వదిలి వెళ్లిపోయాను. కెమెరా ముందు ఒకలా, కెమెరా వెనకాల మరోలా ఉంటాడు. తన ఆటిట్యూడ్ నచ్చేది కాదు. అమ్మాయిలను అసలు గౌరవించడు" అని అతడి అసలు రూపాన్ని వివరించింది.
ఇక భార్గవ్‌తో పని చేసిన స్నేహితులు కూడా అతడెలాంటివాడో చెప్పుకొచ్చారు. "మా మధ్య గొడవలేం లేవు. కానీ ఆ మధ్య మమ్మల్ని అందరినీ రూమ్‌లో నుంచి వెళ్లిపోమన్నాడు, సింగిల్‌గా ఉంటాను, ఎవరూ వద్దు అని చెప్పేశాడు. మేం పెద్దగా పట్టించుకోలేదు, కానీ మళ్లీ మళ్లీ అదే చెప్పాడు. అందుకని అంతా వెళ్లిపోయాం. అయితే అతడు రూమ్‌లో సింగిల్‌గా మాత్రం లేడు. గతంలో భార్గవ్‌కు ఓ లవర్ ఉండేది. ఆమె కోసం చేయి కోసుకున్నాడు, తర్వాత వచ్చిన ఇంకో అమ్మాయి కోసం కోసుకున్నాడు. చాలాసార్లు ఇలానే చేసేవాడు. అన్నం తినేంత ఈజీగా చేయి కోసుకుంటాడు. ఎందుకిలా చేస్తున్నావ్ అని అడిగితే ఎక్కువ చేస్తాడు, అందుకని దాన్ని మేం పట్టించుకునేవాళ్లం కాదు" అని అతడి స్నేహితులు పేర్కొన్నారు.