Jr NTR: తారక్‌ నన్ను మామూలుగా ఆడుకునేవారు కాదు: అనిల్‌ రావిపూడి

Anil Ravipudi Shocking Comments On Jr NTR Ragging In Shooting Location - Sakshi

Anil Ravipudi: హిట్‌ సినిమాలకు పెట్టింది పేరు అనిల్‌ రావిపూడి. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఒక్క హిట్‌ కూడా కొట్టలేకపోయిన ఆయన డైరెక్టర్‌గా మారిన తర్వాత మాత్రం వరుస విజయాలు అందుకుంటూ వస్తున్నాడు. పటాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌ 2, సరిలేరు నీకెవ్వరూ .. ఇలా తను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ దగ్గర విజయవంతంగా ఆడాయి. తాజాగా ఈ డైరెక్టర్‌ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

'పటాస్‌ పూర్తయ్యే సమయానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఎక్కువగా ఆఫీస్‌కు వస్తుండేవారు. ఆయన నన్ను మామూలుగా ఆడుకునేవారు కాదు. రోజూ ర్యాగింగ్‌ చేసేవారు. ర్యాగింగ్‌ అంటే బాధపెట్టడం కాదు, అల్లరి చేసేవాళ్లు, జోక్‌ చేసేవాళ్లు. నాకు కథ చెప్పవా? అని అడిగేవారు. నా మొదటి సినిమానే ఇంకా రిలీజ్‌ కాదు, ఏం చెప్పాలి అని నేనంటే.. అయితే నాకు కథ చెప్పవా? అని సరదాగా ఆడేసుకునేవాళ్లు. అవి నేను మర్చిపోలేని జ్ఞాపకాలు' అని ఆనాటి క్షణాలను గుర్తు చేసుకున్నాడు అనిల్‌ రావిపూడి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top