ప్రేమనంతా పంచేయాలి...

Andaru Bagundali Andulo Nenundali Song Launch By Sonusood - Sakshi

‘‘సూపర్‌’ సినిమా నుంచి అలీ, నేను మంచి స్నేహితులం. ఆయన తీసిన ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ సినిమా టైటిల్‌ సాంగ్‌ను నేను రిలీజ్‌ చేయటం హ్యాపీ. అలీ భాయ్‌.. నువ్వెప్పుడూ సూపర్‌స్టారే’’ అన్నారు సోనూ సూద్‌. నరేశ్, అలీ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’. శ్రీపురం కిరణ్‌ దర్శకత్వంలో అలీ సమర్పణలో అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌ నిర్మించారు.

ఈ చిత్రంలోని రెండో పాట ‘అందరూ బావుండాలి.. అందులో నేనుండాలి.. ప్రాణమే పోయేలోగా ప్రేమనంతా పంచేయాలి..’ పాటను సోనూ సూద్‌ రిలీజ్‌ చేశారు. అలీ మాట్లాడుతూ –‘‘సోషల్‌ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరి వల్ల అమాయకులకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది? అనే కథతో ఈ చిత్రం రూపొందింది. టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేసిన సోనూ సూద్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top