అమితాబ్‌ సరసన పూజా హెగ్డే...

Amitabh, Pooja launch Dildaar Bana De Campaign - Sakshi

వరుస హిట్స్‌.. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌ అవకాశాలతో దూసుకుపోతున్న అందాల భామ పూజా హెగ్డే కి మరో క్రెడిట్‌ దక్కింది. బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ పక్కన నటించే అవకాశం ఆమెని వరించింది. అయితే అది వెండితెరపై కాదు ప్రముఖ శీతల పానీయాల బ్రాండ్‌ మజా రూపొందిస్తున్న ప్రచార చిత్రంలో. అయితేనేం... స్వల్ప కాలంలోనే ఈ చాన్స్‌ దక్కించుకోవడంతో పూజా ఫుల్‌ హ్యాపీగా ఉంది. తనకు చిన్ననాటి నుంచి అభిమాన నటుడైన బాలీవుడ్‌ ఎవర్‌గ్రీన్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా నటి పూజాహెగ్డే చెప్పారు.

మాజా బ్రాండ్‌ నిర్వహిస్తున్న దిల్‌ దార్‌ బన్‌ దే ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనతో కలిసి ప్రచార చిత్రంలో పనిచేయడం కూడా అరుదైన అవకాశమేనన్నారు. అంతేకాకుండా  ఈ ప్రచార చిత్రానికి ప్రముఖ సినీ దర్శకుడు మాజిత్‌ సర్కార్‌ దర్శకత్వం వహించడం కూడా తనను ఆనందింపజేస్తోందంటోందామె. వీక్షకుల్లో సానుకూల థృక్పధాన్ని, మానవత్వాన్ని పెంచేందుకు దోహదం చేసే ప్రచార కార్యక్రమంగా కూడా దిల్‌ దార్‌ బన్‌దేని ఆమె పేర్కొన్నారు. ఏదేమైనా త్వరలోనే పూజా హెగ్డే అమితాబ్‌తో కలిసి సిల్వర్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top