ఆర్ఆర్ఆర్: స్పెషల్ సాంగ్ పాడిన ఆలియా
ఆలియా... ఆలపించారయా!
ప్రతిష్టాత్మక ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ద్వారా తెలుగుకు పరిచయం అవుతున్నారు ఆలియా భట్. ఈ సినిమాలో ఆమె మీద ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట రాజమౌళి. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్కు జోడీగా ఒలివియా మోరిస్, చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్నారు ఆలియా. ఓ భారీ సెట్లో ఆమెపై ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందనే విషయం తెలిసిందే. ఇందులో డ్యాన్స్ చేయడమే కాకుండా ఆ పాటను స్వయంగా పాడతారట కూడా. అయితే ఈ పాట హిందీ వెర్షన్ను మాత్రమే ఆలియా ఆలపిస్తారట. గతంలో తాను నటించిన ‘హమ్టీ శర్మా కా దుల్హనియా, షాందార్’ సినిమాల్లో పాటలు పాడారు ఆలియా. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది.
చదవండి: ఆర్.ఆర్.ఆర్: తీవ్రంగా కసరత్తులు, కొంచెం రిలాక్స్
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు